Lucky Bhaskar movie: బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది దుల్కర్ సల్మాన్. సీతారామం, మహానటి వంటి సినిమాలలో తన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్ కి ఎంతటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన పేరుకి బాలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. అదేవిధంగా ఈయన సినిమాలు టాలీవుడ్ లో దుమ్ము రేపుతున్నాయి కూడా.
ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ తెలుగులో సినిమాలు చేసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న మూవీ ” లక్కీ భాస్కర్ “. ఈ సినిమాని అనౌన్స్ చేసిన నాటి నుంచి నేటి వరకు ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా ప్రేక్షక ఆదరణ పొందలేకపోయింది.
నిజానికి మీనాక్షి స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడుతుంది. కానీ గుంటూరు కారంలో సైడ్ క్యారెక్టర్ లో నటించడంతో ప్రతి ఒక్కరూ నిరాశకు గురయ్యారు. ఆ సినిమాలో ఈ ముద్దుగుమ్మ కి పెద్ద ప్రాధాన్యత కూడా లేదు. ఏదో సెకండ్ హీరోయిన్ ఉండాలి అని పెట్టుకున్నట్లు మాత్రమే అనిపించింది. ఇక అటువంటి డిజాస్టర్ నుంచి కోరుకునేందుకు మీనాక్షికి మరియు తన కెరీర్ కి కొంత సమయం పడుతుంది. ఇక ప్రస్తుతం మీనాక్షి నటిస్తున్న లక్కీ భాస్కర్ మూవీ కనుక సూపర్ హిట్ అయితే మీనాక్షి మళ్ళీ ఫామ్ లోకి వస్తుందని చెప్పవచ్చు.
ఇక నేడు మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. ఈ సందర్భంగానే ఈ మూవీ నుంచి ఈమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో మీనాక్షి చౌదరి డీసెంట్ లుక్ లో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ సుమతి అనే పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ తో వెల్లడించారు. మరి ఈ మూవీలో మీనాక్షి పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుంది? తన రోల్ కి ప్రాధాన్యత ఉందా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. ప్రస్తుతం మీనాక్షి చౌదరి పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!