మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస హిట్స్‌తో ఫులు జోష్‌లో ఉన్నాడు. రీసెంట్గా వచ్చిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 2 తో మరో బిగ్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త తడబడ్డినా ఆ తరువాత కంటెంట్ ఉన్న స్టోరీస్‌తో సినిమాలు చేస్తు, ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా తన వైపు తిప్పుకున్నాడు.. ఇటీవలే వచ్చిన ఎఫ్2 సాలీడ్ కావడంతో ఈ హీరో మార్కెట్ కూడా పెరిపోయింది. దీంతో వరుణ్ తేజ్‌తో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఓ తమిళ సూపర్ హిట్ సినిమా రీమేక్‌లో నటించబోతున్నాడు.
కోలీవుడ్ సూపర్ హిట్ అయిన జిగర్తాండ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు వరుణ్. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా తాజాగా సినీ ప్రముఖుల మధ్య గ్రాండ్‌గా లాంచ్ అయింది. తెలుగు నెటివిటికి తగ్గట్టు దర్శకుడు హరీష్ శంకర్ కథని రెడీ చేశాడట..14 రీల్స్ ప్లస్‌లో బ్యానర్లో రామ్ అచంట, గోపి అచంట నిర్మిస్తున్నఈ సినిమా టైటిల్‌ను, కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. క్లాప్ బోర్డ్‌పై తుపాకీ, రీల్‌తో డిజైన్ చేసిన వాల్మికి అనే టైటిల్ ఆడియన్స్‌లో సినిమాపై మరింత క్యూరియసిటీ క్రియేట్ చేస్తుంది. ఫ్రిబవరి ఫస్ట్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుంది.
తమిళ్ వర్షెన్‌లో నెగిటివ్ రోల్లో బాబీ సింహా పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నట్లు సమాచారం.ఇక బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన దబాంగ్ సినిమాని గబ్బర్ సింగ్లా రీమేక్ చేసి టాలీవుడ్లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన హరీష్ శంకర్, ఇప్పుడు జిగర్తాండని రీమేక్ చేస్తుడంతో ఇదీ కూడా భారీ హిట్‌గా నిలుస్తోందని భావిస్తున్నాడు వరుణ్ తేజ్. మరి వరుణ్ నమ్మకాన్ని హరీష్ శంకర్ నిలబెట్టుకుని తను కూడా మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!