NewsOrbit
సినిమా

ఫలించిన చిరంజీవి తపన.. ‘స్వయంకృషి’కి 33 ఏళ్లు..

megastar chiranjeevi movie swayamkrushi completes 33 years

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎక్కువగా చేసినన సినిమాలు మాస్ కంటెంట్ ఉన్నవే. డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ, మాస్ ఎలివేషన్స్.. ఇవే ఆయన సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఆ సినిమాలతోనే ఆయన సూపర్ స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ప్రేక్షకులు కూడా చిరంజీవిని అలాంటి సినిమాల్లో చూడటానికే ఇష్టపడేవారు. అయితే.. చిరంజీవిలోని నటనను రాబట్టిన దర్శకులు ఉన్నారు.. చిరంజీవిలోని నటుడిని తెరపై ఆవిష్కరించిన సినిమాలూ ఉన్నాయి. ఆ లిస్టులో నిలిచే మొదటి దర్శకుడు కె.విశ్వనాధ్ అయితే.. చిరంజీవి నటనకు గీటురాయిగా నిలిచిన సినిమా ‘స్వయంకృషి’. ఈ సినిమా విడుదలై నేటికి 33 ఏళ్లు పూర్తయ్యాయి.

megastar chiranjeevi movie swayamkrushi completes 33 years
megastar chiranjeevi movie swayamkrushi completes 33 years

బ్రేక్ డ్యాన్సులు.. ఫైట్లు లేకపోయినా..

అదే ఏడాది జూలై 23న విడుదలైన పసివాడి ప్రాణం భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. చిరంజీవి తొలిసారి చేసిన బ్రేక్ డ్యాన్సులకు ధియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. మాస్ అండ్ చైల్డ్ సెంటిమెంట్, చిరంజీవి మాస్ యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఆ సమయంలో సెప్టెంబర్ 3న విడుదలైంది స్వయంకృషి. కథ, కథనం, నటన, మేకప్ లేని నటులు మాత్రమే ఉన్న ఆఫ్ బీట్ సినిమా. చెప్పులు కుట్టే వ్యక్తి పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారు. చిరంజీవి నటన చూస్తూ.. సినిమాలో బ్రేక్ డ్యాన్సులు, ఫైట్లు లేవనే విషయాన్నే మర్చిపోయారు అభిమానులు, ప్రేక్షకులు. కె.విశ్వనాధ్ అద్భుతమైన కథ, కథనంతో ప్రేక్షకులు సినిమాలో లీనమైపోయేలా తెరకెక్కించారు.

రష్యన్ భాషలోకి డబ్ అయిన ఘనత స్వయంకృషిదే

కమల్ హాసన్ కు స్వాతిముత్యంలా తనకూ అలాంటి సినిమా ఉండాలని భావిస్తున్న చిరంజీవి మనోగతాన్ని తెలుసుకున్న కె.విశ్వనాధ్ ఈ కథ వినిపించారట. తాను ఎదురుచూస్తున్న కథ ఇదేనంటూ చిరంజీవి చేసిన స్వయంకృషి ఆయన కెరీర్లో కలికితురాయిగా నిలిచిపోయింది. పూర్ణోదయా క్రియేషన్స్ పై ఏడిద నాగేశ్వరరావు ఈ సినిమా నిర్మించారు. రమేశ్ నాయుడు అందించిన సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. స్వయంకృషి టైటిల్.. చిరంజీవికి సరిగ్గా సరిపోయింది. ఈ సినిమా సూపర్ హిట్టై 26 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. చిరంజీవికి తొలిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది. స్వయంకృషిని రష్యన్ భాషలోకి డబ్ చేయడం విశేషం. మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించడం సినిమా గొప్పదనానికి నిదర్శనం. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఆసియా ఫసిఫిక్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శితమైందీ సినిమా.

Related posts

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N