Prabhas Anushka: “బాహుబలి” సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన ప్రభాస్ కెరియర్ పరంగా ప్రస్తుతం డౌన్ ఫాల్ లో ఉన్నారు. “బాహుబలి” తర్వాత చేసిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. రాజమౌళితో సినిమా చేసిన ప్రతిసారి ప్రభాస్ ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అంతకుముందు చత్రపతి తర్వాత ప్రభాస్ నటించిన చాలా సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఆ క్రమంలో కొరటాల శివ దర్శకత్వంలో నటించిన “మిర్చి” సినిమా ప్రభాస్ కి మంచి బ్రేక్ ఇవ్వడం జరిగింది. ప్రభాస్ కి జోడిగా అనుష్క నటన సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమా తర్వాత “బాహుబలి” లో మళ్ళీ వీరిద్దరూ కలిసి నటించడం జరిగింది. దీంతో ఇండస్ట్రీలో ఈ జంటకి హిట్ పెయిర్ గా పేరు వచ్చింది. బాహుబలి తర్వాత అనుష్క కూడా సరైన హిట్ అందుకోలేదు.
ఇటీవల చేసిన “మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి” పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ సినిమాకి ఎంతో ప్లస్ అయింది. వయసులో చిన్నవాడైన గాని తనకంటే పెద్ద అమ్మాయి తో లవ్ లో పడ్డ హీరోగా నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో నటించాడు. ఇదిలా ఉంటే “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ ఇకపై లేడీ ఓరియంటెడ్ ఇంక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేయకూడదని కమర్షియల్ సినిమాలో చేస్తానని చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి కూల్ హిట్టు కొట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తూ ఉండటంతో “మిర్చి 2” చేయాలని ఆలోచనలో కొరటాల ఉన్నట్లు టాక్. ఈ క్రమంలో ఈ సినిమాలో ప్రభాస్ డబల్ పాత్రలో నటించబోతున్నట్లు.. ఇక మొగుడు పెళ్ళాం పాత్రలో ప్రభాస్ అనుష్క కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే “మిర్చి” సినిమాలో ప్రభాస్ అనుష్క ఇద్దరు హీరో హీరోయిన్స్. చివరిలో పెళ్లి చేసుకోవడం జరుగుద్ది. దీంతో రెండో భాగంలో ప్రభాస్ అనుష్క పెద్ద తరహా పాత్ర చేయనున్నట్లు ఆ దిశగా కొరటాల స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా సబ్జెక్టులతో పరాజయాలు ఎదురవుతున్న క్రమంలో ప్రభాస్… కొరటాలతో చేయబోయే సినిమా తెలుగులో మాత్రమే చేయాలని ఆ రకంగా హిట్ అందుకునే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ అంతా ఓకే అయితే ఈ సినిమాని యూవి క్రియేషన్స్ నిర్మించనున్నట్లు త్వరలోనే షూటింగ్ వివరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!