NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Lagadapati Rajagopal: బిగ్ న్యూస్ : లగడపాటి రాజ్ గోపాల్ రీ ఎంట్రీ – ఆ నియోజికవర్గం లో పోటీ ?

Lagadapati Rajagopal: లగడపాటి రాజగోపాల్ .. తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని నాయకుడు. రెండు పర్యాయాలు విజయవాడ ఎంపీగా పని చేసిన లగడపాటి రాజగోపాల్ అనతి కాలంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్ర విభజనతో రాజకీయ సన్యాసం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ఆనాడు సవాల్ చేసిన రాజగోపాల్ .. రాష్ట్ర విభజన జరగడంతో ఆయన అన్న మాట ప్రకారం రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

 

అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దురంగా ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో మాత్రం సర్వేలు చేయిస్తూ రిపోర్టులు వెల్లడిస్తూ ఉండే వారు. గతంలో ఆయన సర్వేలు చాలా వరకు కరెక్టు అయ్యాయి. దీంతో ఆయన ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయన చెప్పిన జోస్యం పూర్తిగా తప్పయ్యాయి.  ఏపీలో జగన్ ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రాడనీ, అలా వస్తే తాను ఇక సర్వేల నుండి కూడా తప్పుకుంటానని ప్రకటించారు. లగడపాటి సర్వే మాటలు నమ్మి అనేక మంది పందాలు కాసి లక్షల రూపాయలు పొగొట్టుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో సర్వేలు, జోస్యాలు చెప్పడం కూడా మానేశారు. గత పదేళ్లుగా పూర్తిగా తన  వ్యాపార కార్యకలాపాల్లోనే నిమగ్నమైయ్యారు.

 

ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ మరల రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వార్తలు వినబడుతున్నాయి. మరల విజయవాడ నుండే పోటీ చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే తన సన్నిహితులతో అభిప్రాయాలను కూడా తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. పలువురు పారిశ్రామిక వేత్తలు, ఆయన సన్నిహితులు కూడా ఆయనను 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని వత్తిడి కూడా చేస్తున్నారుట. అయితే ఏ పార్టీ నుండి లగడపాటి రీ ఎంట్రీ ఇస్తారనే దానిపై ఇంకా క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతం రాజగోపాల్ ఏ పార్టీలోనూ క్రియాశీలకంగా లేరు. కానీ రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో కొంత సన్నిహితంగా ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో తెలుగుదేశం పార్టీ నుండే పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

 

టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయమవుతుందన్న వార్తల నేపథ్యంలో లగడపాటి టీడీపీ నుండి రంగంలోకి దిగాలని ఆయన సన్నిహితులు చెబుతున్నారుట. అయితే గత ఎన్నికల సమయంలోనూ లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో ఆయన ఈ వార్తలను ఖండించారు. తనకు పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజగోపాల్ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నారేమో అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీలో ఎంపీ టికెట్ విషయంలో నెలకొన్న వర్గ విభేదాలు నేపథ్యంలో లగడపాటి ఎంట్రీ వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

tdp

అయితే లగడపాటి రాజగోపాల్ ఇంత వరకూ అధికారికంగా ప్రకటించలేదు. ఆయన సన్నిహితులు మాత్రం రాజగోపాల్ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారుట. లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తే మాత్రం విజయవాడ రాజకీయాలు మరింత వెడెక్కడం ఖాయమని భావిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ చరిత్రలో కేఎల్ రావు మినహా వరుసగా మూడు పర్యాయాలు ఎవరూ విజయం సాధించలేదు. పర్వతనేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్, కొడాలి నాని వరుసగా రెండు సార్లు గెలిచారు. చెన్నుపాటి విద్య, వడ్డే శోభనాదీశ్వరరావులు రెండు సార్లు గెలిచినప్పటికీ మధ్యలో ఒక సారి ఓటమి పాలైయ్యారు. దీంతో ఈ అంచనాలతో లగడపాటి రాజగోపాల్ రీ ఎంట్రీ ఇస్తారో లేదో వేచి చూడాలి.

PM Modi: ఇండియా ని భారత్ గా మార్చడం వెనక ఇంత పెద్ద ప్లానింగ్ ఉందా .. వామ్మో మోడీ మామూలోడు కాదు !

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju