KGF 2: కేజీఎఫ్ చాప్టర్- 2 సినిమా గురించి ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కేజీఎఫ్ చాప్టర్- 1 ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడంతో రెండవ భాగంపై ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సినిమా గురించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినగాని తెగ మురిసిపోతున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయినా కేజీఎఫ్ చాప్టర్- 2 ట్రైలర్ కు ప్రేక్షకులు నుంచి విశేష స్పందన వచ్చింది రిలీజ్ అయిన 24 గంటల్లోనే 109 మిలియన్ వ్యూస్ సాధించి అన్ని రికార్డులను తిరగరాసింది.
KGF 2 Trailer: చరణ్ చేతుల మీదగా `కెజియఫ్ 2` ట్రైలర్.. చూస్తే గూస్బంప్సే!
KGF 2: తెలుగులో కేజీఎఫ్ చాప్టర్- 2 ట్రైలర్ సునామి :
చెప్పుకోదగ్గా విశేషం ఏంటంటే ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో తెలుగులో 20 మిలియన్ల వ్యూస్ ను రాబట్టడం అంటే మాములు విషయం కాదు.ఎందుకంటే కేజీఎఫ్ సినిమా మన తెలుగు సినిమా కాదు. ఇది ఒక కన్నడ సినిమా. అయినాగాని తెలుగులో ఇన్ని వ్యూస్ రావడం అంటే ఆశ్చర్యకరంగానే ఉంది కదా.ఈ సినిమా కన్నడలో 18 మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది. అలాగే తమిళ్లో 12 మిలియన్ల వ్యూస్,మలయాళంలో 8 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. ఈ సినిమా ట్రైలర్ కు కన్నడ భాషలో కంటే తెలుగు, హిందీ భాషల్లోనే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. తెలుగులో 2.51 కోట్ల వ్యూస్, 8.54 లక్షల లైక్స్ వచ్చాయి.మొత్తంగా చూసుకుంటే అన్ని భాషలు కలిపి 10 కోట్లకు పైగానే వ్యూస్ వచ్చాయి.
KGF 2: తెలుగు, హిందీలో అప్పుడే ఇంత క్రేజా..ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బద్దలే..!
రిలీజ్ కు ముందే రికార్డ్స్ బద్దలు కొట్టిన కేజీఎఫ్ చాప్టర్- 2:
ఒక కన్నడ సినిమా అయి ఉండి తెలుగులోఎక్కువ వ్యూస్ రావడం విశేషమే.మన తెలుగు సినిమాలను. మించి మరి వ్యూస్ రావడం అంటే తెలుగు ఇండస్ట్రీలో కూడా రాఖీకి ఉన్న క్రెజ్ ఏంటో అర్ధం అవుతుంది. ఇంకా రిలీజ్. కూడా అవ్వకుండానే ట్రిపుల్ ఆర్ రికార్డులు సైతం బద్దలు కొట్టింది కేజీఎఫ్ చాప్టర్- 2. ఇంకా సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్ లో రికార్డ్స్ రాఖీని వరిస్తాయో అనే ఆసక్తి అందరిలోనూ మొదలయింది.ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే ఎమోషన్స్ తో పాటు యాక్షన్ అండ్ అద్భుత విజువల్స్ కూడా బాగా చూపించారు.
ట్రైలర్ చూస్తే మాములుగా లేదుగా :
చాప్టర్ వన్ ముగిసిన పాయింట్ తోనే మళ్ళీ సెకండ్ పార్ట్ ట్రైలర్ ప్రారంబమైంది.. ట్రైలర్ చూస్తుంటే గుస్ బంప్స్ అయ్యేలా ఉంది.ముఖ్యంగా హీరో యశ్ చెప్పిన డైలాగ్ లు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కోసం మొత్తం భారతదేశం ఎదురుచూస్తోంది. ఈ సినిమాలో. నటినటులు కూడా ఎవరి పాత్రల్లో వారు ఒదిగిపోయారు .విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అలాగే రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు సైతం ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.