Niharika: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. `ముద్దపప్పు ఆవకాయ్` అనే వెబ్ సిరీస్‌తో నటిగా మారింది. ఆ తర్వాత `ఒక మనసు` మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. హ్యపి వెడ్డింగ్, సూర్యకాంతం ఇలా పలు చిత్రాలు చేసింది.
కానీ, అవేంటి ఆమెకు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో తండ్రి కోరిక మేరకు గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో పెళ్లి చేసుకుని వైవామిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత నటిగా సినిమాలేమి చేయకపోయినా.. నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్‌లను నిర్మిస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే నిహారిక.. గత కొద్ది రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను డీ-యాక్టివేట్ చేయడంతో రకరకాల పుకార్లు తెరపైకి వచ్చాయి. కొందరు ఆమె గర్భవతి అయిందని ప్రచారం చేయగా.. మరికొందరు ఆమె తన భర్త నుంచి ఏకంగా విడిపోయిందంటూ రూమర్స్‌ను క్రియేట్ చేశారు.
కానీ, అవేమి నిజం కాలేదు. ఇక తాజాగా నిహారిక ఇన్‌స్టాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, ఓ షాకింగ్ పోస్ట్ కూడా పెట్టింది..` 8 వారాల ఇన్స్టాగ్రామ్ బ్రేక్ నుంచి నేను 3 పాఠాలు నేర్చుకున్నా.. 1.ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు, 2. ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను, 3. ప్రస్తుతం నేను నిజంగా రీఫ్రెష్ అయ్యాను. పోస్టులు చేసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను` అని పేర్కొంటూ ఓ పిక్ ను షేర్ చేసింది. దీంతో ఈమె రీఎంట్రీ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది.
https://www.instagram.com/p/Cc-W_YspE2F/?utm_source=ig_web_copy_link
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!