మరికొన్ని రోజుల్లో మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలు కాబోతోంది. దీంతో మెగా వారి ఇంట సందడి మొదలైందనే చెప్పుకోవచ్చు. మెగా బ్రదర్ తన ముద్దుల కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రకారం చేస్తున్నట్టు ఇదివరకే నాగబాబు ప్రకటించారు. కాగా తన చెల్లిపెళ్లి పనులన్నింటినీ వరుణ్ దగ్గరుండి చూసుకుంటున్నారని నాగబాబు తెలిపాడు.
అయితే ఈ పెళ్లిని రాజస్థాన్ లో చేసేందుకు ఏర్పాట్లన్నీ సిద్దమయ్యాయనే చెప్పుకోవచ్చు. డిసెంబర్ 9 న ఈ ముద్దుగుమ్మ అత్తవారింట్లో అడుగుపెట్టబోతోంది. అయితే ఈ బ్యూటీ క్వీన్ తన పెళ్లి ఎగ్జైట్ మెంట్ లో ఉందని అనిపిస్తుంది. కాబోయే భర్తతో ఫోటోల మీద ఫోటోలు తీసుకుంటూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. పెళ్లికి ఇంకా 7 రోజులే మిగిలిందోచ్.. కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ వరుడు చైతన్యతో కలిసి దిగిన ఒక ఫోటోను ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.ఇప్పుడు ఆ ఫోటో వైరల్ గా మారింది.
వీరి జంటను చూసి నెటిజన్లు చూడముచ్చటైన జంట అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తన పెళ్లి జరుగుతుందన్న సంతోషంలో పార్టీల మీద పార్టీలు చేసుకుంటోంది. ఈ మధ్యన సొట్టబుగ్గల చిన్నది లావణ్యా త్రిపాఠి తో పార్టీ చేసుకుంది. అలాగే తన ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో కూడా పార్టీ చేసుకుందని వార్తలు వినిపించాయి. అలాగే కాబోయే భర్త చైతన్య, తన ఫ్రెండ్స్ తో కలిసి కూడా పార్టీ చేసుకుందట ఈ బామ. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు కూడా నిహారిక షేర్ చేసింది.
ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే మెగా వారి పెళ్లి కావడంతో మెగా హీరోలంతా పెళ్లి సందడి చేయడానికి సిద్దమయ్యారనే చెప్పుకోవచ్చు. అందుకోసం మెగా బ్రదర్స్ కూడా వారి షూటింగ్ లకు కొంత బ్రేక్ వేసి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించడానికి సిద్దమయ్యారు. అయితే తాజాగా రామ్ చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ నుంచి సెలవు కోరినట్టు తెలుస్తోంది.
https://www.instagram.com/p/CISNZz2Ju1v/?utm_source=ig_web_copy_link
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!