NBK 107: నటసింహం నందమూరి బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్ “NBK 107” పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. ఇటీవల స్వర్గీయ రామారావు శత జయంతి సందర్భంగా.. సినిమా నుండి బాలయ్య బాబు కత్తి పట్టుకున పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందు సినిమా ప్రారంభంలో బాలయ్య నల్ల షర్ట్ లుంగీతో… నల్ల కళ్ళద్దాలతో మైనింగ్ ప్రదేశాల నుండి బయటకు వస్తున్న వాకింగ్ లుక్ విడుదల చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే జూన్ పదవ తారీకు బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందే “NBK 107” మేకర్స్ అభిమానులను అలరించటానికి సరికొత్త ప్లాన్ వేయటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు సినిమా నుండి కొత్త అప్డేట్ వస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. టైటిల్ తో కూడిన టీజర్ విడుదల చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కింద నిర్మితమవుతున్న ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన శృతి హసన్ నటిస్తోంది. “అఖండ” సినిమాతో గత ఏడాది భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య బాబు.. మంచి జోరుమీద ఉన్నాడు.
ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని వరుసపెట్టి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న “NBK 107” పై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదే సమయంలో అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమాకి సంబంధించి కూడా బిగ్ ఆప్ డేట్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ 61 జన్మదినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో రేపు భారీ ఎత్తున కార్యక్రమాలు అభిమానులు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదే సమయంలో సాయంత్రం విడుదల టైటిల్ లేదా టీజర్ నీ సోషల్ మీడియాలో వైరల్ చేయటానికి అభిమానులు పక్క ప్రణాళికలు వేసుకుంటున్నారు. NBK 107 పేరిట రికార్డులు క్రియేట్ చేయాలని రెడీ అవుతున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!