NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Prema Entha Madhuram February 28 2024 Episode 1190: నాన్న రేపు నా బర్త్ డే అంటున్న ఆనంది, అక్కి అభయ్ ల బర్త్డే కదా అని ఆలోచిస్తున్న  ఆర్య..

Prema Entha Madhuram Today Episode February 28 2024 Episode 1190 Highlights

Prema Entha Madhuram February 28 2024 Episode 1190: ఇంత శ్రమ తీసుకుని పాప కోసం వెతికినందుకు చాలా థాంక్స్ అండి ఏ కాస్త ఇన్ఫర్మేషన్ దొరికిన మాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి అని ఆర్య అంటాడు. అలాగే అని వాళ్ళు వెళ్ళిపోతారు.  పాప గురించి ఏమీ తెలియట్లేదు నువ్వే ఏదో ఒకటి చేసి ఆ పాప బ్యాగు చూడు అని జెండే అంటాడు. ఆర్య పాప నీ మీద చాలా కేరింగ్ తీసుకుంటుంది తన దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకోకు జాగ్రత్తగా డీల్ చెయ్ అని జెండా చెబుతాడు. అలాగే అని ఆర్య వెళ్తాడు. కట్ చేస్తే, అభయ్ అక్కి కొట్టుకుంటూ ఉంటారు. అన్నయ్య నువ్వే ఓడిపోయావ్ నేను స్ట్రాంగ్ గళ్ళు ని అని అక్కి అంటుంది. మంచం అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఆగండి ఈ పాలు తాగండి అని అను అంటుంది. అమ్మ అన్నయ్య ముందు నన్ను కొట్టాడు అని అక్కి అంటుంది. సరే ముందు పాలు తాగండి నాన్న షాపింగ్ కి వెళ్దామన్నాడు అని అను అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 28 2024 Episode 1190 Highlights
 Prema Entha Madhuram Today Episode February 28 2024 Episode 1190 Highlights

అమ్మ నాకు పాలు వద్దు జ్యూస్ కావాలి అని అక్కి అంటుంది. స్ట్రాంగ్ గాళ్లునని ఇందాక అంటున్నావ్ కదా మరి స్ట్రాంగ్ గా ఉండాలంటే పాలు తాగాలి కదా పాలు తాగు రేపటి నుంచి టైం టేబుల్ రాసి పెడతాను అలాగే ఫాలో అవ్వాలి అని అను అంటుంది. పాలు ఎవరు తాగితే వాళ్ళని షాపింగ్ తీసుకువెళ్తాను అని అను అంటుంది. అభాయ్ నేను తాగుతానమ్మ నన్ను షాపింగ్ తీసుకువెళ్ళు అని అంటాడు. నేను కూడా తాగుతాను అమ్మ నన్ను కూడా తీసుకెళ్ళు అని పిల్లలు ఇద్దరు పాలు తాగుతారు. కట్ చేస్తే ఆర్య ఆనంది దగ్గరికి వస్తాడు. ఆనంది రాజనందిని చీర పట్టుకుని చూస్తూ ఉంటుంది. ఆనంది ఏం చేస్తున్నావ్ అని ఆర్య అడుగుతాడు. మీకోసమే చూస్తున్నాను నాన్న ఈ లోగ మీరే వచ్చారు అని ఆనంది అంటుంది. నాకోసమా ఎందుకు అని ఆర్య అంటాడు. నాన్న ఈ రాజనందిని చీర నాకు డ్రెస్ గా కుట్టి ఇవ్వవా అని ఆనంది అడుగుతుంది. చీర డ్రస్సుగా ఎందుకమ్మా డ్రెస్  కొనిస్తాను అని ఆర్య అంటాడు. వద్దు నాన్న నాకు ఈ రాజనందిని చీరే డ్రస్సుగా కావాలి రేపు నా పుట్టినరోజు కదా కుట్టించి ఇవ్వవా అని ఆనంది అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 28 2024 Episode 1190 Highlights
Prema Entha Madhuram Today Episode February 28 2024 Episode 1190 Highlights

రేపు పిల్లలు ఇద్దరు బర్త్డే కదా ఆనంది బర్త్డే కూడానా ఇది కో ఇన్సిడెంట్సా లేదంటే ఇంకేంటి అని ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు. సరేనమ్మా అని ఆర్య ఆ చీర తీసుకొని కిందికి వస్తాడు. కట్ చేస్తే, సార్ ఎక్కడికి వెళ్లారు నీకోసమే చూస్తున్నాను పిల్లలు షాపింగ్ కి వెళ్ళాలి అంటున్నారు అని అను అంటుంది. పిల్లలు రెడీ అయ్యారా వెళ్దాం అని ఆర్య అంటాడు. ఈ చీర ఏంటి సార్ అని అను అడుగుతుంది. రేపు ఆనంది పుట్టినరోజు అంట అను ఈ చీర డ్రెస్ గా కుట్టివమని నన్ను అడిగింది అని ఆర్య అంటాడు. ఇదేంటి రేపు ఆనంది పుట్టినరోజు కూడానా కో ఇన్సిడెంట్సా అని అను మనసులో అనుకుంటుంది. రేపు అభయ్ అక్కకి బర్త్డే కదా సార్ ఆనంది పుట్టినరోజు కూడానా అని అను అంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు అను అని ఆర్య అంటాడు. ఇంతలో పిల్లలు వచ్చి మేము రెడీ షాపింగ్ వెళ్దామా అని అంటారు. ఇంతలో అను వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ అను పిల్లలకు ఒకసారి ఫోన్ ఇవ్వవా అని అంటుంది పద్మావతి.

Prema Entha Madhuram Today Episode February 28 2024 Episode 1190 Highlights
Prema Entha Madhuram Today Episode February 28 2024 Episode 1190 Highlights

హలో అమ్మమ్మ ఎలా ఉన్నావ్ అని అక్కి అడుగుతుంది. రేపు నా పుట్టినరోజు అమ్మమ్మ షాపింగ్ కి వెళ్దాం అనుకుంటున్నాం నువ్వు మా ఇంటికి రా అని అక్కి అంటుంది. రేపు మీరే మా ఇంటికి రండి మీకు ఇష్టమైనవన్నీ వండి పెడతాను అని పద్మావతి అంటుంది. అమ్మకి ఇవ్వండి అని పద్మ అంటుంది. చెప్పమ్మా అని అను అంటుంది.రేపు పిల్లల పుట్టినరోజు అని మీ నాన్న ఉంగరం చేయించాడు షాపింగ్ అయిపోయాక ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళండి అమ్మ అని పద్దు చెబుతుంది. ఆర్య అను పిల్లలు అందరూ షాపింగ్ కి వెళ్తారు. కట్ చేస్తే, మానసి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని ఛాయా అడుగుతుంది. అవర్ధన్ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కుతుంది అని మానస అంటుంది. అంత టెన్షన్ పడడం దేనికి మీ సర్వెంట్ కి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని ఛాయా అంటుంది. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు అది నాకన్నా బిజీగా ఉన్నట్టుంది అని మానస అంటుంది.  లక్ష్మి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు తనే ఫోన్ చేస్తుంది అని మానస ఫోన్ ఎత్తి ఎక్కడ చచ్చావే ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు అని అడుగుతుంది. అమ్మ కాస్త నాకు మాట్లాడే టైం ఇవ్వండి అని లక్ష్మీ అంటుంది. ఆ పాప గురించి ఏమైనా తెలిసిందా అని మానస అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 28 2024 Episode 1190 Highlights
Prema Entha Madhuram Today Episode February 28 2024 Episode 1190 Highlights

ఇంకా ఏమీ తెలియలేదు అమ్మ అంటూ ఉండగా ఆర్య వాళ్ళ అమ్మ వస్తుంది. వెంటనే లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. అది ఫోన్ కట్ చేసింది అని ఆఫీస్ బాయ్ కి ఫోన్ చేసి అడుగుతుంది మానస. అతను కూడా పాప గురించి ఏమీ తెలియలేదు మేడం అని చెబుతాడు. పాప గురించి ఇంకా ఏమీ తెలియలేదంట చాయా ఎలా ఇప్పుడు అని మనస అంటుంది. ఇంతలో మళ్లీ లక్ష్మీ ఫోన్ చేస్తుంది. ఎందుకే ఇందాక ఫోన్ కట్ చేశావు అని మానస అంటుంది. శాంతమ్మ గారు వచ్చారమ్మా అందుకే ఫోన్ కట్ చేశాను అని లక్ష్మి చెబుతుంది. రేపు పిల్లలు పుట్టినరోజు కాకుండా కొత్తగా వచ్చిన పాప పుట్టినరోజు అమ్మ అని లక్ష్మి చెబుతుంది. అవునా అని మానస షాక్ అవుతుంది. ఇంకా ఏదైనా తెలిస్తే నాకు వెంటనే ఫోన్ చెయ్ అని మనసా ఫోన్ కట్ చేస్తుంది.ఏంటి మానసి ఏ ఏమంటుంది లక్ష్మి అని ఛాయా అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 28 2024 Episode 1190 Highlights
Prema Entha Madhuram Today Episode February 28 2024 Episode 1190 Highlights

రేపు కొత్తగా వచ్చిన పాపది కూడా పుట్టినరోజు అంట ఆ ఇంటికి పాపకి ఏంటి సంబంధం అని మానస అంటుంది. అది తెలుసుకోవాలంటే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాల్సిందే అని ఛాయా అంటుంది. రేపు ఏం చేసినా సరే ఆ ఇంట్లో అడుగు పెడతాను అని మానస అనుకుంటుంది. కట్ చేస్తే, అమ్మ నాకు ఈ డ్రెస్సు నచ్చలేదు అని అక్కి అంటుంది.అదేంటి షాపింగ్ మాల్ అంత వెతికి మరి మీకొన్నాం కదా అని అను అంటుంది.నాపుట్టినరోజుకి నేను నాన్న ఒకే కలర్ డ్రెస్ నువ్వు అన్నయ్య ఒకే కలర్ వేసుకోవాలనుకున్నాను కదా అని అక్కి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella