Premalu: సాధారణంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం ఉరుకులు పరుగులు జీవితంలో గడిపేస్తున్నారు. డబ్బులు సంపాదించేందుకు పరుగులు పెడుతూ తమని తాము మరిచిపోతున్నారు. కాళీ దొరికిన సమయంలో కామెడీ సినిమాలు చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇక నేటి కాలంలో కామెడీ సినిమాలే తక్కువ అయ్యాయని చెప్పొచ్చు. గతంలో ఎన్నో వినోద్ మాత్మక సినిమాలు రిలీజ్ అయ్యేవి.
ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా సినిమాలంటూ ఫైటింగ్ లే ఎక్కువగా ఉంటున్నాయి. ఇంకా ఎప్పుడో ఒకటి ఎంటర్టైనర్ మూవీ వస్తుంది. దానిని చూసేందుకు కొందరికి సమయం దొరుకుతుంటే మరి కొందరికి మాత్రం సమయమే కరమవుతుంది. ఇక తాజాగా అటువంటి సినిమానే వచ్చింది. మీరు చివరిసారిగా కడుపుబ్బ నవ్వుకున్న సినిమా ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకోండి.
బాగా టైం పడుతుంది కదా? ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మలయాళం వారు రీసెంట్గా ప్రేమలు అనే మూవీ రిలీజ్ చేశారు. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది. కామెడీ మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుంది. ఒకప్పుడు ఎర్లీ 2000 టెన్స్ లో వచ్చేవి చూడండి ఆ రేంజ్ లో మంచి కామెడీ ఇచ్చారు చిత్ర బృందం. ఇక మాకు మలయాళం రాదు కదా మేము ఈ సినిమాని ఎలా చూసి అర్థం చేసుకోము అని అనుకోకండి.. ఈ సినిమాని మార్చ్ 8వ తేదీన తెలుగులో రిలీజ్ చేయనున్నారు ఈ మూవీ టీం.
ఈ సినిమాని మీరు తప్పనిసరిగా చూడండి. లేదంటే ఓ కామెడీ ఎంటర్టైనర్ను మిస్ అయినట్లే. ఈ సినిమా చూసేందుకు ఈనెల 8వ తారీఖున థియేటర్ కి వెళ్లి మీ మైండ్ ని రిఫ్రెష్ చేసుకోండి. ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని కడుపుబ్బ నవ్విస్తుంది. తెలుగులో సినిమా చేసేందుకు వారు సిద్ధమై ముందుకు వచ్చారు.. కడుపుబ్బా నవ్వేందుకు మీరు రెడీగా ఉండండి..!
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!