Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనదైన టాలెంట్‌తో అంచలంచలుగా ఎదగు మెగా పవర్ స్టార్‌గా స్పెషల్ ఇమేజ్ను సంపాదించుకున్నాడు రామ్ చరణ్. అదే సమయంలో తండ్రికి తగ్గ తనయుడిగా అందరి చేత మంచి మార్కులు వేయించుకుంన్నాడు.
ప్రస్తుతం హీరోగానే కాకుండా నిర్మాతగానూ దూసుకుపోతున్న చరణ్.. మార్చి 27న 36వ బర్త్ డే జరుపుకోబోతున్నారు. ఇంకా కొద్ది రోజులే సమయం ఉండటంతో.. ఇప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే మరోవైపు చరణ్ బర్త్‌డే సందర్భంగా `ఆర్సీ 15` నుంచి ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ట్రీట్ రెడీ అవుతోంది.
అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ యాక్షన్ ఎంటెర్టైనర్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా.. త్వరలోనే మూడో షెడ్యూల్ సైతం స్టార్ట్ కానుంది.
అయితే చరణ్ పుట్టిన రోజు కానుకగా.. ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్‌తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి `సర్కారోడు` అనే టైటిల్‌ను పరిశీలనతో ఉంది. కాగా, చరణ్ నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్` మార్చి 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!