Ram Charan: నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 38వ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. ఈ బర్త్‌డే చెర్రీకి వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి దర్శకత్వంలో ఈయన చేసిన `ఆర్ఆర్ఆర్` మూవీ మార్చి 25న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో సక్సెస్ జ్యోష్‌లో ఉన్న చరణ్.. ఈ సారి మరింత హ్యాపీగా తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఈ సందర్భంగా తారక్ తన ఇంట్లో అర్థరాత్రే చెర్రీ కోసం ప్రత్యేకమైన పుట్టినరోజు వేడుకను నిర్వహించాడు. రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన, ఎన్టీఆర్ అర్ధాంగి లక్ష్మీ ప్రణతి, రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయతో సహా పలువురు ప్రముఖులు పాల్గొని ఎన్టీఆర్ చేత కేక్ కట్ చేయించారు. ఇందులో సంబంధించిన వీడియోను ఎన్టీఆర్ తాజాగా పోస్ట్‌లో చేశాడు.
అయితే ఈ వీడియోలో రామ్ చరణ్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారింది. `తారక్ నిజంగా ధైర్యం తెచ్చుకుని ఎన్నో సంవత్సరాలు వైఫ్‌ని వదిలేసుకుని నా ఇంటికి వచ్చాడు.. ఈ విషయంలో ప్రణతికి థ్యాంక్స్ చెప్పాలో, తారక్‌కి థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు` అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా, గతంలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ మాట్లాడూతూ.. `మార్చి 26న తన భార్య లక్ష్మీప్రణతి పుట్టినరోజు. మార్చి 27న చరణ్ పుట్టినరోజు. మా ఇద్దరి ఇళ్లు ఒకే చోట ఉంటాయి. అందువల్ల 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటలయ్యిందంటే చాలు నేను గేటు దగ్గర ఉండేవాడిని, చరణ్ కారులో మా ఇంటి ముందు ఉండేవాడు. ఇద్దరం వెళ్లిపోయేవాళ్లం. ప్రణతి ఫోన్ చేస్తుంది. చరణ్ దగ్గర ఉన్నాను అని చెబుతాను. అదేంటి నా బర్త్ డే కదా? అని ప్రణతి అంటుంది. అది నిన్ననే అయిపోయిందిగా.. ఇప్పుడు పన్నెండు దాటింది డేట్ మారింది అని చెబుతుంటాను. అలా ఎన్నో ఏళ్లుగా రామ్ చరణ్ బర్త్ డేను సెలెబ్రేట్ చేస్తున్నాను.` అంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే చరణ్ అలా కామెంట్స్ చేశాడు.
https://www.instagram.com/reel/CbmtzWvlR5L/?utm_source=ig_web_copy_link