Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి పరిచయాలు అక్కర్లేదు. కన్నడ మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ అందాల భామ.. `ఛలో`తో గ్రాండ్‌గా సినీ గడప తొక్కింది. ఆ తర్వాత విజయవంతమైన చిత్రాలు చేస్తూ అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న రష్మిక.. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ దూసుకుపోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్‌ను మెయింటెయిన్ చేస్తున్న ఈ భామ.. తాజాగా షూటింగ్స్ నుంచి కాస్త గ్యాప్ తీసుకుని తన చిన్ననాటి స్నేహితురాలి పెళ్లికి హాజరు అయింది. తమిళనాడులో కొడగులో ఈ వివాహం జరిగింది. అక్కడ రష్మిక తన ఫ్రెండ్స్‌తో కలిసి కూర్గి స్టైల్లో శారీ కట్టుకుని అందంగా ముస్తాబైంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అంతేకాదు, పెళ్లి కుమార్తె మరియు మిగిలిన ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన పలు ఫోటోలను రష్మిక ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఈ రోజు నా స్నేహితుడు రాగిణి ముద్దయ్య పెళ్లి చేసుకుంది. ఉదయం 4 గంటలకు ఫ్లైట్ క్యాన్సిల్ కావడం, ఆ తర్వాత కూడా నాలుగైదు సార్లు ఫ్లైట్ ఆలస్యం కావడంతో పెళ్లికి హాజరు కాలేనేమో అనుకున్నా.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ దేవుని దయ వల్ల ఎట్టకేలకు పెళ్లికి వచ్చేశాను. ఇక ఈ గ్యంగ్లోనే నేను పెరిగాను. వీళ్లతో నాకు 17ఏళ్ల అనుబంధం ఉంది. ఇప్పటికీ వీళ్లు ఏమీ మారలేదు. నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. వీళ్లంతా నా వాళ్లు అని మరోసారి నిరూపించారు. చాలాకాలం తర్వాత వీరిని ఇలా కలవడం ఎంతో సంతోషంగా ఉంది. రష్మిక అనే అమ్మాయి నటిగా ప్రపంచానికి పరిచయం కాకముందు ఇలా ఉండేది. ఇప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు` అంటూ రాసుకొచ్చింది. దీంతో రష్మిక పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!