Rashmika Mandanna: టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో రష్మిక మందన్నా పేరు ముందు వరసలో ఉంటుంది. `ఛలో` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ కన్నమ ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పటి వరకు హద్దులు మీరి అందాలు ఆరబోసిన దాఖలాలు లేవు.
కానీ, తాజాగా మాత్రం రష్మిక హాట్ బాంబ్లా అవతారమెత్తింది. తాజాగా ఓ మేగజీన్ కోసం ఎద అందాలను ఎలివేట్ చేస్తూ మితిమీరన గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారగా.. వాటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వామ్మో వార్నాయనో రష్మిక ఏంటీ ఇలా మారిపోయింది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది `పుష్ప` వంటి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ మొన్నీమధ్య `ఆడవాళ్ళు మీకు జోహార్లు`తో అందరినీ పలకరించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఇక ప్రస్తుతం రష్మిక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన `పుష్ప 2` చిత్రంలో నటిస్తోంది. అలాగే హిందీలో మిషన్ మజ్ను, గుడ్‌బై సినిమాలు కూడా చేస్తున్న ఈ బ్యూటీ.. తమిళంలో ఓ స్టార్ హీరో సినిమాను టేకప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.