RRR: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” ఈ ఏడాది ఇండియాలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా దాదాపు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో వెయ్యి కోట్లకు పైగా సాధించిన సినిమాలలో దాదాపు సగం సినిమాలు రాజమౌళి సినిమాలే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్ట్ టైం చరణ్, తారక్ కలిసినటించడంతో.. అటు “బాహుబలి 2” తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు ఏమాత్రం తగ్గకుండా.. జక్కన్న అద్భుతరీతిలో “RRR” తెరకెక్కించాడు. ఫలితంగా విడుదలైన ప్రతి చోట సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం “RRR” ఓటిటిలో స్క్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. వెండితెర మీదే కాదు ఇప్పుడు ఓటిటిలో కూడా “RRR” రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ స్థాయిలో నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ఆదరణ పొందిన ఇండియన్ ఫిలింగా రికార్డు క్రియేట్ చేసినట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలియజేసింది. తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మే 20వ తారీకు నుండి నెట్ ఫ్లిక్స్ లో “RRR” అందుబాటులోకి రావడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు దాదాపు 45 మిలియన్ అవర్స్ సినిమా స్ట్రీమింగ్ అయిందని నెట్ ఫ్లిక్స్ తెలిపింది. నెట్ ఫ్లిక్స్ లో “RRR” అందుబాటులోకి వచ్చాక హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది దర్శకులు రాజమౌళి పనితనాన్ని పొగిడారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం ఇజ్రాయెల్ అయితే ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాయడం విశేషం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!