RRR: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” ఏడాది మార్చి నెలలో విడుదలయ్యి.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. “బాహుబలి” చిత్రం ద్వారా ప్రపంచ సినీ లోకాన్ని తనవైపు ఆకర్షించుకున్న జక్కన్న…”RRR” తో మరోసారి సత్తా చాటారు. ఇండియాలో ₹1000 కోట్లకు పైగానే కలెక్షన్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ లో…స్ట్రీమ్ అయి అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.
హాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు “RRR” చిత్రీకరించిన విధానానికి ముగ్దులయ్యారు. జక్కన్న పనితనాన్ని ఇంకా చరన్, తారక్ పెర్ఫార్మెన్స్ లను.. పొగడ్తలతో ముంచెత్తరు. నువ్వు ఇలా ఉంటే రాజమౌళి బాహుబలి జపాన్ దేశంలో అనేక రికార్డులు సృష్టించటం తెలిసిందే. ఇంత జక్కన్న సినిమాలకు అక్కడ సపరేట్ మార్కెట్ క్రియేట్ అయింది. ఈ పరిణామంతో అక్టోబర్ నెలలో “RRR” విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా విడుదలైన నాటి నుండి అక్కడ అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. జపాన్ లో “RRR” విడుదలయ్యి 305 మిలియన్ యోన్ (₹17.09కోట్లు) కేవలం 34 రోజుల్లో రాబట్టడం జరిగింది.
ఈ రీతిగా కలెక్షన్స్ సాధించి తొలి భారతీయ సినిమాగా జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద “RRR” సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. జపాన్ దేశంలో కూడా “RRR” సినిమా యూనిట్ బాగానే ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రీతిగానే ప్రేక్షకుల నుండి సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో ఓవరాల్ గా “RRR” ఇంకా ఎంత కలెక్ట్ చేస్తది అన్నది ఆసక్తికరంగా మారింది. జపాన్ దేశంలో అత్యధికంగా కలెక్షన్లు సాధించిన సినిమాగా సూపర్ స్టార్ రజినీకాంత్ “ముత్తు” పేరిట రికార్డు ఉంది. జపాన్ “ముత్తు” రికార్డు “RRR” అధిగమిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!