‘బాహుబలి` తర్వాత ప్రభాస్ పెద్ద స్టార్ హీరో అయ్యారు. ఎంతలా అంటే ఇంటర్నేషనల్లో సినీ అభిమానులు ఆయన తదుపరి సినిమా `సాహో` కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తోన్న `సాహో` ఆగస్ట్ 15న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఒక పక్క పాటల చిత్రీకరణ, మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ అండ్ టీమ్ ఆస్ట్రియాలో పాట చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ ఆధ్వర్యంలో పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ చిత్రీకరణ 1368 అడుగుల ఎత్తులో కేబుల్ కార్స్ తీసుకుని చిత్రీకరించారు. అయితే అంత ఎత్తులో షూట్ జరుగుతున్నప్పుడు యూనిట్ అంతా కంగారుపడకుండా హీరో ప్రభాస్ అందర్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేశారు. చిత్ర యూనిట్ అంతా ఇంతలా సపోర్ట్ చేసినందుకు సోషల్ మీడియా ద్వారా నిర్మాతలు దన్యవాదాలు తెలిపారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!