Samantha: అవును.. సమంత గర్వంగా చెబుతోంది ఆ సినిమా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా అని. ఇక ఆ సినిమా ఏమిటాని అనుకుంటున్నారా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పుష్ప గురించి ఆమె మాట్లాడింది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డు కలెక్షన్ల మోత మోగించిన విషయం విదితమే. ఇక ఇందులో సమంత ఐటెం సాంగ్ ఊ అంటావా ఊఊ అంటావా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Samantha : ఆ విషయంలో ఎవరేమన్నా పట్టించుకోను, నాగురించి నాకు తెలుసు: సమంత
Samantha: తాజా సమాచారమిదే:
యూట్యూబ్ లో రికార్డులను సృష్టిస్తున్న ఈ సాంగ్ ప్రస్తుతం పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ గా మారింది. అవును.. తాజాగా ఈ సాంగ్ ని అల్ట్రా మైమీ మ్యూజిక్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. యూఎస్ ఫ్లోరిడాలోని మైమీ పట్టణలో జరిగే బిగ్గెస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్ లో ఊ అంటావా ఊఊ అంటావా సాంగ్ మారుమ్రోగింది. లక్షలాది మంది అభిమానుల మధ్య ఈ సాంగ్ వీడియోను కూడా ప్లే చేస్తూ సమంత.. సమంత అంటూ ఫ్యాన్స్ అరవడం ఇక్కడ కొసమెరుపు.
Samantha: సమంత కామెంట్స్ వైరల్.. వాళ్ళు డబ్బులివ్వకుండా పనిచేయించుకున్నారట!
సమంత స్పందన ఇదే:
ఇక ఈ వీడియోను ఒక నెటిజన్ సామ్ కి షేర్ చేస్తూ.. “అల్ట్రా మైమీలో ఊ అంటావా ఊఊ అంటావా సాంగ్.. కనీసం చెప్పడానికి కూడా నమ్మశక్యంగా లేని రీచ్.. పాన్ ఇండియానా బొక్కా.. అల్లు అర్జున్ పాన్ వరల్డ్.. అతిపెద్ద మ్యూజిక్ ఫెస్టివల్ లో పుష్ప మ్యానియా” అంటూ రాసుకొచ్చాడు. ఇక దీనికి సామ్ సమాధానము ఇస్తూ.. నిజమేనా? ఇది అల్ట్రా మైమీ మ్యూజిక్ ఫెస్టివల్ లోనా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది! ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!