Bumrah- Sanjana Ganesan : టీమిండియా క్రికెటర్ బుమ్రా గురించి గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు గల కారణం బుమ్రా పెళ్లి చేసుకుంటున్నాడు అనే వార్తలు రావడమే అని చెప్పవచ్చు.మార్చి 14 ,15న ఇతనివివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరగబోతోందని అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వయంగా బుమ్రా తల్లి దగ్గర నుండి పెళ్లి పనులను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనుపమ పరమేశ్వరన్ అని వార్తలు వినిపించాయి. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు, ప్రస్తుతం వీరిద్దరు పెళ్లి ద్వారా ఒక్కటవుతున్న వార్తలు రావడంతో,బుమ్రా పెళ్లి గురించి అనుపమ పరమేశ్వరన్ తల్లి స్పందించారు. అనుపమ పరమేశ్వరన్ కి ఇప్పుడప్పుడే పెళ్లి చేయాలనే ఆలోచనలు లేవని అమే స్పష్టంగా తెలియజేశారు. అనుపమ పరమేశ్వరన్ కాకపోతే అతనిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
పెళ్లి కూతురు మోడల్ సంజనా గణేషన్:
బుమ్రాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అంటూ మోడల్, స్పోర్ట్స్ కామెంటేటర్ అయినా సంజనా గణేషన్ పేరు వినబడుతోంది.వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లికి సంబంధించి తొందరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ బ్యూటీ బుమ్రాపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.జనవరిలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరిగే సమయంలో బుమ్రా ఎక్స్‌ప్రెషన్స్‌ను ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దానికి మీ ఆదివారం బూమ్రా కంటే బాగా గడిచిందా అని కామెంట్ పెట్టారు. అందుకు సంజన బుమ్రా ఆన్ ఫీల్డ్ మూడ్, ఈ రోజు నా మూడ్ ఒకేలా ఉంటాయి అంటూ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారి బూమ్ర పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సంజనా అంటూ, వీరిద్దరికీ కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!