ప్రస్తుతం టాలీవుడ్ ని షేక్ చేస్తున్న హీరోయిన్లలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల ఒకరు. ఈ ముద్దుగుమ్మ పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ధమాకా తో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఈమె తిరుగులేని కెరీర్ తో దూసుకుపోతుంది.
ఇక ఇటీవలే ఈ ముద్దుగుమ్మ కెరీర్ లో నాలుగు ఫ్లాప్స్ పడ్డాయి. ఇక దీంతో ఈ ముద్దుగుమ్మ కి ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయి. 2023 మొత్తం ఈమె సినిమాలే ఉన్నాయి. ఈమె ఇమేజ్ అలా ఏర్పడింది మరి. వరుసగా సినిమా అవకాశాలను అందుకున్న ఈమె ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఈమె అభిమానులు నిరాశకు గురయ్యారు.
రీసెంట్ గా గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు ట్రీట్ ఇస్తుంది శ్రీ లీల. ఇక తాజాగా కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్లో హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ రెచ్చిపోయింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక వీటిని చూసిన ప్రేక్షకులు..” సినిమా అవకాశాలు లేకపోతే ఇలానే దిగజారి పోతారు. ముందు కథలను ఎంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త పడితే ఇప్పుడు ఈ స్థితి వచ్చేది కాదు. ఇక నీ కెరీర్ టాలీవుడ్ లో ముగిసిపోయినట్లే ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.