NewsOrbit
సినిమా

Shruti Haasan: ఎన్ని పార్ట్స్ కి సర్జరీ చేయించుకున్నావ‌ని అడిగిన నెటిజ‌న్‌..శ్రుతి షాకింగ్ రిప్లై!

Shruti Haasan: సీనియ‌ర్ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ కూతురిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ శ్రుతి హాస‌న్ గురించి కొత్త‌గా ప‌రిచాయ‌లు అవ‌స‌రం లేదు. త‌న‌దైన అందం, అభిన‌యం, అంత‌కు మించిన టాలెంట్‌తో ఈ బ్యూటీ టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. కెరీర్ మాంచి జోరు మీద దూసుకుపోతున్న స‌మ‌యంలోనే శ్రుతికి త‌న బాయ్‌ప్రెండ్‌తో బ్రేక‌ప్ అయింది.

దాంతో డిప్రెష‌న్‌కు గురైన కొన్నాళ్ల సినిమాల‌కు దూర‌మైనా.. మ‌ళ్లీ రెట్టింపు వేగంగా దూసుకువ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులో గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్న `ఎన్‌బీకే 107`లో బాల‌య్యకు జోడీగా న‌టిస్తోంది. అలాగే బాబీ, చిరంజీవి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న `మెగా 154`లో హీరోయిన్‌గా ఫిక్స్ అయింది.

వీటితో పాటు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం `స‌లార్‌`లో ప్ర‌భాస్‌కు జోడీగా శ్రుతి మెర‌వ‌బోతోంది. అయితే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న‌ప్ప‌టికీ.. శ్రుతి సోష‌ల్ మీడియాను మాత్రం వ‌దిలి పెట్ట‌దు. నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో త‌న అభిమానులను అల‌రిస్తుంటుంది. ఇక తాజాగా ఈ భామ త‌న ఫాలోవ‌ర్స్‌తో చిట్ చాట్ సెష‌న్ నిర్వ‌హించింది.

ఈ సెషన్‌లో శ్రుతి హాసన్‌కు ఒక వింత ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. ఓ నెటిజ‌న్ `మీ బాడీలోని ఎన్ని పార్ట్స్ కి సర్జరీలు చేయించుకున్నారు` అంటూ కాంట్రవర్షియల్ ప్రశ్న అడిగాడు. ఈ ప్ర‌శ్న‌కు శ్రుతి షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఇంత‌కీ ఆమె ఏం చెప్పిందంటే.. `నీ పని నువ్వు చూసుకో అంటూనే… అడిగావు కాబట్టి చెబుతున్నాను. దీన‌కి సర్జరీ చేయించుకున్నాను` అంటూ ముక్కు ఫొటో పెట్టింది. కాగా, సెల‌బ్రెటీలు స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం చాలా కామ‌న్‌. అయితే ఎవ‌రూ ఈ విష‌యాల‌ను బ‌య‌ట పెట్ట‌రు. కానీ, శ్రుతి మాత్రం గ‌తంలోనే ఎలాంటి మొహ‌మాటం లేకుండా త‌న ముక్కుకు స‌ర్జ‌రీ చేయించుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N