Big breaking: మహేష్ బాబు గారాల పట్టి సితార మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన చిలిపి చేష్టలతో మరియు డాన్సింగ్ తో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఇక తండ్రిని మించిన ప్రదర్శనతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
తండ్రి సూపర్ స్టార్ హీరో తల్లి ఒకప్పటి స్టార్ హీరోయిన్ అవ్వడంతో ఈమెకి కూడా యాక్టింగ్ పై మక్కువ ఎక్కువైంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలను ఆరబోస్తూ తన ఫాన్స్ కి ట్రీట్ ఇస్తూ ఉంటుంది సితార. ఇక తాజాగా సితార గట్టమనేని పేరుని, ఫోటోలని ఉపయోగించి కొందరు డబ్బులు కోసం నేరాలకు పాల్పడ్డారు.
ఇక ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎవ్వరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఘట్టమనేని సితార పేరుతో కొన్ని ట్రెండింగ్ పెట్టుబడి లింకులను పంపుతూ డబ్బులు దోచేస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండమని.. ఎలాంటి అనుమానాలు కలిగిన తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయమని సైబర్ పోలీసులు హెచ్చరించారు.
ఇక కొందరి పోలీసులకి ఈ విషయం తెలియక సితార పై కంప్లైంట్ పెట్టారు. నిజానికి ఇందులో సితార తప్పు ఏమీ లేకపోయినా తనపై కేసు నమోదు అయింది. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ కేసుని కొట్టేశారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.