Seetharam sitralu trailer: ప్రస్తుతం రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు మొత్తం ఏదో ఒక పాన్ ఇండియా సినిమాపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ గుర్తింపు పొందుతున్నాయి. భారీగా ప్రమోషన్స్ చేసే వీలు లేకపోవడంతో తమ సినిమాలో ఒక స్టార్ హీరో సినిమా గురించి తీసుకుంటూ పెద్ద ఎత్తులోనే హైప్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఇటువంటి కాన్సెప్ట్ కి సంబంధించిన సినిమా నే మరొకటి రూపొందుతుంది.
తాజాగా ఈ మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు ” సీతారాం చిత్రాలు “. ఈ మూవీలో లక్ష్మణ్, భ్రమరాంబిక, కిశోరి ధాత్రిక్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. రొమాంటిక్ అండ్ క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీ కి డి నాగశివధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాతోనే ఈయన టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు కూడా.
గడిచిపోయిన రోజులను గుర్తి చేస్తూ.. పెళ్లి విసిఆర్ క్యాసెట్స్ పై అల్లిన కథాంశమే సీతారాం చిత్రాలు మూవీ. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ కి డైరెక్టర్ మారుతి హాజరయ్యారు. దీంతో ప్రతి ఒక్కరి చూపు ఈ సినిమాపై మల్లింది. ” వాడైతే పెళ్లి క్యాసెట్స్ కు బాహుబలి, త్రిబుల్ ఆర్ వి ఎఫెక్ట్స్ వేస్తున్నాడు.
అదే నేను వాడి దగ్గరకు వెళితే ఆదిపురుష్ విఎఫెక్ట్స్ నేర్చుకోవచ్చు ” అనే డైలాగ్ ఈ ట్రైలర్ లో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఫన్నీ ఫన్నీ గా మాట్లాడుతూనే ప్రభాస్ సినిమాపై భారీ డైలాగ్ ని వదిలేసారు. అంటే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ వి ఎఫెక్ట్స్ ని ట్రోల్ చేస్తూ కించపరిచారు. ఇక డార్లింగ్ సినిమాని కించపరిచారంటే డైరెక్ట్ గా ప్రభాస్ ని కించపరిచినట్లు. ఏదేమైనప్పటికీ ఇలా చేయడం ప్రభాస్ ఫ్యాన్స్ కి అస్సలు నచ్చడం లేదు. ఈ ట్రైలర్ ని చూసి ప్రభాస్ ఫ్యాన్స్ గోరంగా మండిపడుతున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!