Sitara : రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎనిమిదేళ్ల వయస్సుకే సితార సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. సితార సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను కలిగి ఉండటంతో పాటు ఆ ఛానల్ లో ఆద్యతో కలిసి వీడియోలను చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు.
సితార ప్రముఖ యూట్యూబ్ యాంకర్లకు ఇంటర్యూలు ఇవ్వడంతో పాటు ఆ ఇంటర్వ్యూలలో కిలక విషయాలను వెల్లడించారు. సితార డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు కూడా గతంలో తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సితార తండ్రి మహేష్ బాబుతో కలిసి దుబాయ్ లో ఉన్నారు. మహేష్ హీరోగా గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ డైరెక్షన్ లో సర్కార్ వారి పాట సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
Sitara: వామ్మో.. మహేష్ కూతురులో ఈ టాలెంట్ కూడా ఉందా
మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా 2021 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. మరోవైపు సితార దుబాయ్ లోని ఎడారిలో తెగ సందడి చేసింది. తల్లి నమ్రతతో కలిసి దుబాయ్ లో సితార వయస్సుకు మించిన సాహసాలను చేసింది. సితార సముద్రంలో మరబోటులో షికారు చేసింది. సితార తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తాను ఎడారికి వెళ్లడం ఇదే మొదటిసారని పేర్కొంది.
తనలో కూడా ఒక రేసర్ ఉందని ఇసుక కొండలలో బగ్గీస్ లో వెళ్లడం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని సితార చెప్పుకొచ్చారు. సితార వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతుండగా చిన్న వయస్సులోనే సాహసాలు చేస్తున్న సితార టాలెంట్ ను మహేష్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.