Sohail: సాధారణంగా మన చిత్ర పరిశ్రమలో చిన్న హీరోలకు పెద్దగా డిమాండ్ ఉండదు. ఆ సినిమా లో ఎంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ అది చిన్న సినిమా అయితే ఎవ్వరూ పట్టించుకోరు. తమ సినిమాల ప్రెస్మీట్ లకు ఏ స్టార్ హీరో అయినా వచ్చి ప్రమోట్ చేస్తే అప్పుడు ఆ సినిమాపై కొంచెం ధ్యాసమల్లుతుంది. అంతేగాని ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా సినిమా థియేటర్లో రిలీజ్ అయితే ఫ్లాప్ అనే చెప్పొచ్చు.
ఇక తాజాగా బిగ్ బాస్ సోహిల్ ” బూట్ cut బాలరాజు ” మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈయన సినిమాకి ఎవరు టికెట్లు బుక్ చెయ్యకపోవడంతో నడిరోడ్డుపై కి వచ్చి సినిమా చూడమని రిక్వెస్ట్ చేశాడు సోహెల్. మా సినిమా ఎంతో బాగుంది చూస్తేనే కానీ తెలియదు కదా బ్రో.. ప్లీజ్ ప్రతి ఒక్కరు చూడండి.. అంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఇక ఈయన ఎమోషన్ కి ప్రతి ఒక్కరు కరిగారనే చెప్పొచ్చు.
అలా నైట్ రోడ్డు మీదకి వచ్చాడో.. లేదో.. ఇలా పొద్దున్నే కి భారీ రేంజ్ లో టికెట్లు తెగడం మొదలుపెట్టాయి. ఈయన చేసిన ప్రయత్నానికి ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అయ్యారు. ఇక ప్రస్తుతం సోహిల్ ఓ వీడియోతో దీనిని వెల్లడించాడు. ” నా బాధని అందరూ అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. నేను నా సినిమా కి ఎవరు టికెట్లు కొనడం లేదని బాధతో అలా చేశా.
పొద్దున్నే మా డిస్ట్రిబ్యూటర్స్ నాకు ఫోన్ చేసి.. టికెట్లు అమ్ముడుపోతున్నాయని చెప్పారు. నువ్వేం చేసావో తెలియదు కానీ మార్నింగ్ కి చాలా చేంజ్ వచ్చిందని అన్నారు. ఇదంతా నా దయ కాదు మీరంతా ఇచ్చిన సపోర్ట్. ప్లీజ్ మీరందరూ మరోసారి మా సినిమాని చూడండి ” అంటూ ఓ వీడియోని షేర్ చేశాడు. ప్రస్తుతం సోహిల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే.. నీ ప్లాన్ వర్కౌట్ అయింది కదా బ్రో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!