వర్మ ఏం చేసినా సెన్సేషనే.. ఒకరిని తిట్టినా.. పొగిడినా ఏదో ఒక అర్థముంటుంది. ఇలాంటి వివాదస్పద దర్శకుడు తెరకెక్కించిన చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్` వివాదాలతో విడుదలకు సిద్ధమవుతుంది. దివంగత నేత ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ఎంట్రీ తర్వాత జరిగిన వ్యక్తిగత, రాజకీయ పరిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు వర్మ. ఈ సినిమా ప్రారంభం నుండి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆయన్ని పదవీచ్యుతుడ్ని చేసిన విషయం ఈ సినిమాలో తెరకెక్కించారని సినిమాను విడుదల కానీయకుండా చూడాలని .. చాలా రకాలుగా ప్రయత్నాలు జరిగాయి. అయితే వర్మ దేనీకీ తలొగ్గలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తుంది. అదేంటంటే.. `లక్ష్మీస్ ఎన్టీఆర్`ను ఎన్నికలు తర్వాత విడుదల చేస్తానని వర్మ మాట ఇస్తే.. పాతిక కోట్లు ఇస్తామని తెలుగుదేశం నాయకులు ఆఫర్ చేశారట. అయితే దీనికి వర్మ ఒప్పుకోలేదని సమాచారం. ఇదే విషయాన్ని వర్మ దగ్గర ప్రస్తావిస్తే నేను ఫిలిం మేకర్ని.. బిజినెస్ మేన్ని కాను అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు వర్మ.
previous post
next post