Srikanth: ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వారసులు, వారసురాళ్ల హవా కొనసాగుతోంది. దీనికి ఉదాహరణలు అనేకం వున్నాయి. ప్రస్తుతం కొందరు నటిస్తుండగా, మరికొందరు రంగంలోకి దూకడానికి సిద్ధంగా వున్నారు. మెగాస్టార్, అక్కినేని, మంచు, నందమూరి వారసులు ప్రస్తుతం తమ హవాని కొనసాగిస్తున్నారు. కాగా ఇపుడు తాజాగా హీరో శ్రీకాంత్ కుమార్తె వెండితెరపైన వెలగడానికి రెడీ అయిపోయిందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ పెద్ద కుమారుడు రోషన్ ఆల్రెడీ హీరోగా నిరూపించుకున్న సంగతి విదితమే. ఇపుడు తన సిస్టర్ రంగంలోకి దిగనుంది..
Tollywood: టాలీవుడ్ పరిస్థితి ఏమిటి? ఏపీ సర్కార్ ఎదుట మోకరిల్లిందా? గెలుపెవరిది?
Srikanth: తండ్రి బాటలోనే…
90వ దశకంలో హీరో శ్రీకాంత్ సినిమాలు బాగా ఆడేవి. ఇతనికి ఫ్యామిలీ హీరో అన్న పేరు కూడా ఉంది. ఎందుకంటే, అతని సినిమాలు కుటుంబంతో కలిసి చుసేవిగా ఉండేవి మరి. ఇపుడు తన వారసురాలు కూడా తండ్రిబాటలోనే పయనించనుందని సమాచారం. ప్రస్తుతం అయన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాంత్ కూతురు మంచి మోడ్రన్ (మోడల్) లుక్ కో అందరూ స్టన్ అయ్యేలా వుంది. సదరు ఫోటోను చుసిన నెటిజన్లు ఆమెను కీర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి గుసగుసలు వినిపిస్తున్నాయి.
Bunny NTR: బన్నీ, ఎన్టీఆర్ జపం చేస్తున్న బాలీవుడ్ టాప్ హీరోయిన్..!!
దర్శకేంద్రుడి లాంచింగ్:
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి చెప్పేదేముంది.. అతను లాంచింగ్ చేస్తే ఎలాంటి వారైనా సూపర్ స్టార్లు అవ్వాల్సిందే. ఇటీవల అతని దర్శకత్వంలో శ్రీకాంత్ కుమారుడు రోహన్ సినిమా వచ్చిన సంగతి తెలిసినదే. ఈ క్రమంలోనే శ్రీకాంత్ కూతురిని చుసిన రాఘవేంద్రరావు.. తనకి మంచి భవిష్యత్ ఉందని జోస్యం చెప్పాడట. ఈ విషయం ఆనోటా ఈనోటా నాని ఆఖరికి బయటకు పొక్కడంతో, మన దర్శకేంద్రుడే ఆమెను హీరోయిన్ గా లాంఛ్ చేయబోతున్నాడని అంటూ సోషల్ మీడియాలో వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపైన వారు ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడం కొసమెరుపు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!