NewsOrbit
సినిమా

ఇద్ద‌రు సూప‌ర్‌స్టార్స్‌

 

మ‌నిషిని పోలిన మ‌నిషులు ఏడుగురు ఉంటార‌ని వినే ఉంటాం. అలాంటి వారు తార‌స‌డితే ఆశ్చ‌ర్య‌క‌రంగా అనిపిస్తుంటుంది. కానీ అలాంటి మ‌నిషిని పోలిన స్టార్ హీరోల‌ను క్రియేట్ చేస్తున్నారు మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు. బాహుబ‌లి రిలీజ్ త‌ర్వాత ప్ర‌భాస్ మైన‌పు బొమ్మ‌ను క్రియేట్ చేసిన ఈ మ్యూజియం ఇప్పుడు టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ మైన‌పు బొమ్మ‌ను సిద్ధం చేశారు. ఈ మైన‌పు బొమ్మ‌ను హైద‌రాబాద్‌లో గ‌చ్చిబౌలి స్టేడియంలో లాంచ్ చేశారు. అది కూడా సూప‌ర్‌స్టార్ మ‌హేష్ విడుద‌ల చేయ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది. ఈ కార్య‌క్ర‌మంలో మేడ‌మ్ టుస్సాడ్స్ త‌ర‌ఫున అలెక్స్ పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా స్టాట్చ్యుని విడుద‌ల చేసిన మ‌హేష్ త‌న‌ను తాను చూసుకున్న‌ట్లు ఉంద‌ని, ఆనందంగా, అద్వితీయంగా, గొప్ప‌గా, ఉత్కంఠ‌గా, ఒకింత భ‌యంగా, అన్నీ భావాలు క‌లగ‌లిసిన‌ట్టుగా ఉంద‌ని తెలపారు. త‌న ఫ్యామిలీతో క‌లిసి అక్క‌డికి వెళ్లాల‌ని కూడా అనుకుంటున్నాని కూడా చెప్పారు. అనంత‌రం మీడియాతో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో…

మీ మైన‌పు ప్ర‌తిమ‌ను చూస్తుంటే ఏమ‌నిపిస్తోంది మ‌హేష్‌?
మ‌హేష్‌: చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. మేడ‌మ్ టుస్సాడ్స్ సింగ‌పూర్ వాళ్లు ఇంత బాగా చేశారు. మా పిల్ల‌ల ముందు విడుద‌ల చేయ‌డం చాలా బావుంది. టీమ్‌కి థాంక్యూ.
మీ బొమ్మ‌తో మీకు మాట్లాడే అవ‌కాశం వ‌స్తే ఏం మాట్లాడుతారు?
మ‌హేష్‌: ఎలా ఉన్నావు.. బావున్నా.. అని మాట్లాడుతా. (న‌వ్వుతూ) బొమ్మ చాలా బావుంది.
ఇది వ‌ర‌కు ఎప్పుడైనా మేడ‌మ్ టుసాడ్స్ వెళ్లారా? అప‌్పుడు మీకు ఎలా అనిపించింది?
మ‌హేష్‌: ఆరేళ్ల క్రితంలండ‌న్‌లో మ్యూజియమ్‌కి వెళ్లాను. నా పిల్ల‌లు చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. అక్క‌డ ఉన్న మైన‌పు విగ్ర‌హాల‌తో ఫొటోలు తీసుకున్నారు. వాళ్ల‌ను చూసిన త‌ర్వాత ఎప్పుడో ఒక‌రోజు నా బొమ్మ ఇక్కడికి వ‌స్తుంద‌ని అనుకున్నా. ఇప్పుడు అది జ‌రిగింది. సింగ‌పూర్ మేడ‌మ్ టుస్సాడ్స్ కి ధ‌న్య‌వాదాలు. చాలా ఆనందంగా ఉంది.
సింగ‌పూర్‌కి బ‌య‌ట తొలిసారి ఈ స్టాట్చ్యుని విడుద‌ల చేయ‌డానికి కార‌ణం ఏంటి?
అలెక్స్‌: నిజ‌మే. తొలిసారి మేం ఇలా ఆవిష్క‌రిస్తున్నాం. మ‌హేష్ ఇక్క‌డ చాలా పెద్ద సూప‌ర్‌స్టార్‌. ఆయ‌న ఫ్యాన్స్ కు అందుబాటులో ఉండాల‌ని చేశాం.
కళ్లు, జుత్తు కూడా అలాగే సిద్ధం చేశారు  ఎలా సాధ్య‌మైంది?
మ‌హేష్‌: మెజ‌ర్‌మెంట్స్ అని ఒక‌సారి వ‌చ్చారు. స‌రేన‌ని ఇచ్చాను. కానీ ఇంత డీటైలింగ్‌గా ఉంటుంద‌ని అనుకోలేదు. నా పాదం సైజ్‌, నా చేతుల సైజు, నా రంగు, నా చ‌ర్మం, నా గోళ్లు… ఇలా అన్నీ నాలాగే ఉన్నాయి.
ఇక మీకు సెల్ఫీ డిమాండ్ త‌గ్గుతుందేమో?
మ‌హేష్‌: నాకు సెల్ఫీలు వ‌చ్చినా నా బొమ్మ‌కు సెల్ఫీలు వ‌చ్చినా సేమే క‌దా.
ఈ బొమ్మ‌ను చేయ‌డానికి ఎన్ని రోజులు ప‌ట్టింది?
అలెక్స్‌: 20 మంది 6 నెల‌లు ప‌నిచేశారు. చాలా కేర్ తీసుకుని చేశారు.
ఇలాంటివ‌న్నీ సింగ‌పూర్‌లో పెడ‌తారు. మ‌రి హైద‌రాబాద్‌లో ఎందుకు పెట్టారు?
మ‌హేష్‌: నా షెడ్యూల్స్ టైట్ వ‌ల్ల అక్క‌డికి వెళ్ల‌డానికి కుద‌ర‌లేదు. అందుకే వాళ్లు ఇక్క‌డికి వ‌చ్చారు. అది హాన‌ర్‌. నా పిల్ల‌ల ముందు దీన్ని విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది.
మ‌హేష్ మైనపు బొమ్మ చేయ‌డానికి కార‌ణం ప్ర‌త్యేకంగా ఏదైనా?
మ‌హేష్‌: ప్ర‌పంచంలోని ప‌లువురు చేసిన రిక్వెస్ట్ కార‌ణంగా మేం ఇది చేశాం.
మీ మైనపు బొమ్మ పెడుతున్నార‌ని తెలియ‌గానే.. ఇంట్లో వాళ్లు ఏమ‌న్నారు?
మ‌హేష్‌: మా ఆవిడ ఈ విష‌యాన్ని నాతో చెప్పింది. చాలా హ్యాపీగా ఫీల‌య్యాం. నాకు ఏదో అచీవ్ చేసిన‌ట్టు అనిపించింది.
మైన‌పు విగ్ర‌హం చూడ‌గానే ఇద్ద‌రు భ‌ర్త‌లున్నార‌ని న‌మ్ర‌త అన్నారు.
మ‌హేష్‌: ఇద్ద‌రు మ‌హేష్‌బాబులున్నార‌ని ఆవిడ మాట‌కు అర్థమండీ.
ఈ బొమ్మని చేయ‌డానికి మీరేమైనా సలహాలు ఇచ్చారా?
మ‌హేష్‌: అలాంటిదేమీ లేదు.
ఈ బొమ్మ లుక్ ఏ సినిమాలోది?
మ‌హేష్‌: ఈ లుక్ శ్రీమంతుడులో లుక్‌. శ్రీమంతుడు లో ఆ పోజు బావుంద‌ని చెప్పి, అలా పోజు ఇవ్వ‌మ‌ని అడిగారు. అలాగే ఇచ్చాను. నా అన్నీ ఫొటోలు చూశారు. ఏది బావుంటే, దాన్ని బ‌ట్టి తీసుకున్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Leave a Comment