మూవీ మొగల్ రామానాయుడు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నిర్మాత సురేశ్ బాబు. సినిమాలను ప్రేమించే కుటుంబం నుంచి వచ్చినా.. బిజినెస్ చేయడంలో దిట్ట. సొంత బ్యానర్లో చిన్న సినిమాలను ప్రోత్సహిస్తూ ఔత్సాహికులకు పెద్ద దిక్కయ్యారు. తాజాగా ఆయన ఓటీటీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన కొన్ని రోజులుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌పై రావడం.. సినీ పరిశ్రమకు ఇబ్బందికరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రమాదకరమని కూడా హెచ్చరించారు. అయితే ఇటీవల విడుదలైన ఆయన సొంత సినిమా ‘వెంకీ మామ’ అమెజాన్ స్ట్రీమింగ్ లో రానుందన్న వార్త అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
నిర్మాతగా ఆయన ఆలోచన సరైనదే. అయితే అక్కడ తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూనే.. నిర్మాతగా నష్టపోకూడదన్నది సురేశ్ బాబు వాదన. కంటెంట్ ఉన్న సినిమాలు తీసి.. అమెజాన్, నెట్ ఫ్లిక్స్‌కి అమ్ముకునేలా వ్యవహరించాలన్నది ఆయన చేసే సూచన. మరిదీన్ని చిత్రపరిశ్రమ ఎంతమేరకు ఫాలో అవుతుందో చూడాలి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!