మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్ నిర్మాత. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అక్టోబర్ 2న తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో సైరాను విడుదల చేస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న సైరా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈ వేడుకని సెప్టెంబర్ 18నే నిర్వహించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలో ప్రీ రిలీజ్ డేట్ వాయిదా పడింది. అధికారికంగా సెప్టెంబర్ 22న ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. పవన్‌కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!