SreeLeela: ఈ సంక్రాంతి పండుగకి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనేక సినిమాలు విడుదల కావడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” అతిపెద్ద సినిమాగా రిలీజ్ అయింది. జనవరి 12వ తారీకు విడుదలైన ఈ సినిమా మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల నటించింది. అసలు మొదట ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. కానీ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆమె ప్రాజెక్టు నుండి డ్రాప్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆమె స్థానంలోకి వచ్చిన శ్రీలీల.. బిజీ హీరోయిన్ గా ఒకపక్క మరో సినిమాలు చేస్తూనే “గుంటూరు కారం” కంప్లీట్ చేయటంలో కీలక పాత్ర పోషించింది. ఇక సినిమాలో డ్యాన్స్ అయితే ఒ రేంజ్ లో వేయటం జరిగింది.
మహేష్ బాబే…శ్రీలీల డాన్స్ కి దండం పెట్టేయడం జరిగింది. 2021లో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లో ఎలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన అందులో హీరోయిన్ అవకాశాలు అందుకోవటం జరిగింది. దీంతో ఒకరోజు మూడు షిఫ్ట్ లు కూడా.. పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నుండి ఈ ఏడాది జనవరి వరకు మొత్తం శ్రీలీల నటించిన ఐదు సినిమాలు విడుదలయ్యాయి. ఐదింటిలో భగవంతు కేసరి, గుంటూరు కారం ఉన్నాయి. దీంతో గత ఏడాది నుండి ఈ జనవరి వరకు ఫుల్ బిజీగా సినిమాలతో గడిపేసింది. “గుంటూరు కారం” ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం శ్రీలీలకి ఫ్రీ టైం దొరికిందట.
దీంతో ఒకపక్క మెడిసిన్ చదువుతూనే మరోపక్క ఇప్పుడు రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయిందట. ప్రస్తుతం శ్రీలీల “ఉస్తాద్ భగత్ సింగ్” చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం పవన్ ఏపీ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం కంప్లీట్ కాగా మిగతా షూటింగ్ మరో నాలుగు… ఐదు నెలలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో మొదలయ్యే సినిమా ఏప్రిల్ లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా రెండు నెలలు ఖాళీ టైం దొరకడంతో.. ప్రస్తుతం ఫుల్ రిలాక్స్ మూడ్ లో శ్రీలీల ఎంజాయ్ చేస్తూ ఉందట.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!