Salaar Trailer: 2018లో “బాహుబలి” సినిమాతో భారతీయ చలన చిత్ర రంగం బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన ప్రభాస్ తర్వాత మరో హిట్ అందుకోలేకపోయాడు. “బాహుబలి” తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. “బాహుబలి”తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ కి సరితూగే రీతిలో సినిమాలు చేసిన ప్రభాస్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాడు. సాహో, రాధేశ్యం, ఆదిపురుష్… మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు “సలార్” సినిమా పైన ఆశలు పెట్టుకోవడం జరిగింది. “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” తెరకెక్కటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
“KGF” రెండు పార్ట్స్ భారతీయ చలనచిత్రా రంగంలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. రెండో భాగం ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. యాష్ నీ చాలా మాస్ గా పవర్ ఫుల్ పాత్రలో చూపించడం జరిగింది. “కేజిఎఫ్” సెకండ్ పార్ట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి.. అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్… ప్రభాస్ కలిసి “సలార్” చేయటంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే డిసెంబర్ ఒకటవ తారీఖు అనగా రేపు ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు కొద్ది రోజుల క్రితం అధికారిక ప్రకటన చేయడం తెలిసిందే.
రెండు భాగాలుగా రాబోతున్న ఈ “సలార్” మొదటి భాగం ట్రైలర్ రేపు రాత్రి 7:19 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు… మేకర్స్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. డిసెంబర్ 22వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది. దీంతో డిసెంబర్ మొదటి తారీకు నుంచి ప్రమోషన్స్ మేకర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. కాగా అభిమానులు “సలార్” ట్రైలర్ తో రికార్డులు బద్దలు కొట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్… స్పెషల్ వీడియోలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పరిణామంతో “సలార్” ట్రైలర్ తో తమ అభిమాని హీరో స్టామినా సోషల్ మీడియాకి చూపించాలని డార్లింగ్ ఫాన్స్ భావిస్తున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!