srimukhi: యాంకర్ శ్రీముఖి మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ఒక యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా పలు సినిమాలలో హీరోలకి, హీరోయిన్లకి.. చెల్లి, ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ యాంకరింగ్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పొచ్చు.
టాలీవుడ్ లో టాప్ యాంకర్ల లిస్ట్ తీస్తే సుమ కనకాల తరువాత ఈ ముద్దుగుమ్మ పేరే కనిపిస్తుంది. ఇక గతంలో బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న ఈమె కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇచ్చింది. రన్నరప్ గా మిగిలింది కూడా. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ దూసుకుపోతుంది.
మొదటిగా ఈ ముద్దుగుమ్మ నటి కావాలని టాలీవుడ్ లో అడుగు పెట్టిందట. కానీ అనుకోని కారణాల చేత యాంకరింగ్ కి పరిమితమయింది. ఇక ఈమె సోషల్ మీడియాలో చేసే ఫోటోషూట్స్ ముందు స్టార్ హీరోయిన్లు కూడా సరిపోరని చెప్పొచ్చు. ఆ విధంగా తన అందాలని ఆరబోస్తుంది మరి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
రెట్రో గెటప్ ధరించి కుర్రాళ్ళకి పిచ్చెక్కించింది. అచ్చం పాతకాలం హీరోయిన్ లా కనిపించి ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫొటోస్ చూసిన ప్రేక్షకులు..” ఈమె అందం ముందు ఏ హీరోయిన్ సరిపోదు. అంత బాగుంది మరి. సో బ్యూటిఫుల్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!