#NBK 107: నందమూరి బాలయ్య బాబు అఖండ సినిమాతో గత ఏడాది తిరుగులేని విజయం సాధించడం తెలిసిందే. కరోనా కేసులు ప్రభావం ఎక్కువగా ఉన్న ఆ సమయంలో చాలా పెద్ద సినిమాలు విడుదల చేయడానికి.. ఆలోచించటం జరిగింది. వాస్తవానికి ఆ సమయంలో చాలా పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కావాల్సిన పరిస్థితి. కానీ అప్పుడే కరోనా ప్రభావం ఉన్నట్లు.. వార్తలు వస్తున్న క్రమంలో.. ఎవరు చేయని రీతిలో బాలయ్య బాబు డేరింగ్ అండ్ డాషింగ్ గా అఖండ విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.
అంతకు ముందు బాలయ్యబాబు ఫుల్ అట్టర్ ఫ్లాప్ లో ఉన్నాడు. బోయపాటి శీను దర్శకత్వంలో నటించిన “అఖండ” మూడో సినిమా కావడంతో బ్లాక్బస్టర్ విజయం సాధించటంతో ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. #NBK 107 టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రం కి సంబంధించి టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ఉగాది పండుగ పర్వదినం నాడు విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ వుంది.
ఇప్పటికే తెలంగాణలో సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లో బాలయ్య బాబు మాస్ లుక్ లో నల్ల షర్ట్ తో పాటు కింద లుంగీ కట్టుకొని… బాలయ్య బాబు ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో ఈ సినిమా టైటిల్ ఏంటో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన శృతిహాసన్ నటిస్తోంది. కరోనా నేపథ్యంలో దాదాపు రెండున్నర సంవత్సరాలు షూటింగ్లకు గ్యాప్ వచ్చిన క్రమంలో ఈ సినిమా షూటింగ్ చాలా త్వరగా కంప్లీట్ అయ్యేలా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో బాలయ్య డిసైడ్ అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!