Tillu Square: 2022వ సంవత్సరంలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన “డీజే టిల్లు” బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో డీజే టిల్లు సాంగ్.. అప్పట్లో యువతను ఒక ఊపు ఊపడం జరిగింది. గతంలో వచ్చిన “డీజే టిల్లు” సినిమా భారీగా విజయం సాధించడంలో హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రముఖ పాత్ర పోషించారు. యువతను ఆకట్టుకునే రీతిలో డైలాగ్ డెలివరీతో పాటు ఫుల్ ఎనర్జీతో వన్ మ్యాన్ షో గా స్క్రీన్ మీద రెచ్చిపోయారు. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా “టిల్లు స్క్వేర్” తెరకెక్కటం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ఫిబ్రవరి 14న రిలీజ్ చేయడం జరిగింది.
ప్రేమికుల రోజు సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గతంలో ఎన్నడూ కనిపించని గ్లామర్ లుక్ లో కనిపించడం జరిగింది. “డీజే టిల్లు” సినిమాలో ఓ అమ్మాయి చేతిలో మోసపోయి అనుకోని విధంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని చివరకు సిద్దు ఎలా తప్పించుకుంటాడు అనేది చూపించడం జరిగింది. “టిల్లు స్క్వేర్” సినిమా ట్రైలర్ లో ఓ అమ్మాయి కారణంగా ఎలాంటి ఇబ్బందులలో సిద్దు ఇరుక్కున్నాడు అనేది చూపించారు.
అంతేకాదు అనుపమ సిద్దు మధ్య గట్టిగానే రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. “డీజే టిల్లు” మాదిరిగానే ఈ సినిమా కూడా కంప్లీట్ ఎంటర్టైనర్ గా తీసినట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. సిద్దు మరియు అనుపమ మధ్య లిప్ లాక్ సీన్ కూడా ట్రైలర్ లో చూపించారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 29వ తారీకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!