Mahesh Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు సంవత్సరాల నుండి వరుసపెట్టి బ్లాక్ బస్టర్ విజయాలు మహేష్ సొంతం చేసుకుంటున్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూడు సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న మహేష్ రీసెంట్ గా “సర్కారు వారి పాట” తో మరోసారి సత్తా చాటాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇప్పుడు త్రివిక్రమ్ అదేవిధంగా రాజమౌళి సినిమాలు చేయడానికి మహేష్ రెడీ అవుతూ ఉండటంతో సెకండ్ హ్యట్రిక్ గ్యారెంటీ అని ఆడియెన్స్ చెప్పుకొస్తున్నారు. జూన్ నెల చివరిలో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి మహేష్ రెడీ అవుతున్నాడు. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో… అతడు, ఖలేజా వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు రావడంతో… వస్తున్న ఈ మూడు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ కృష్ణ బర్తడే నాడు మే 31 వ తారీకు నాడు విడుదల చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారట.
అయితే మూడు అక్షరాల పేర్లు కలిగిన సినిమాలు దాదాపు మహేష్ కి సూపర్ హిట్ లు కావటంతో.. మూడు అక్షరాల పేరుతో ఆ అనే అక్షరం తో స్టార్ట్ అయ్యే టైటిల్ పెట్టడానికి త్రివిక్రమ్ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో టాక్. మహేష్ కి మూడు అక్షరాలు సెంటిమెంట్ ఏవిధంగా ఉందో త్రివిక్రమ్ గత కొంత కాలం నుండి ఆ అక్షరం టైటిల్ తో సినిమాలు చేస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు మహేష్ కి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ చేయటానికి త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!