కొన్ని సందర్భాల్లో రిస్క్ చేయాలి. అలా చేస్తేనే సక్సెస్‌తో పాటు తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు విజయ్ దేవరకొండ అలాంటి రిస్క్ చేయడానికి సిద్ధమయ్యాడు. పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డితో యూత్‌లో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఈ కుర్ర హీరో గీత గోవిందంతో స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోలు చేయలేని రిస్క్‌ను విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. చేస్తున్నాడు. అదెంటంటే.. పట్టుమని పది సినిమాలు కూడా చేయని ఈ హీరో.. ఇప్పుడు తన సినిమాలను సౌతిండియా రేంజ్లో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. తెలుగు, తమిళంలో చేసిన నోటా సక్సెస్ ఇవ్వకపోయినా.. విజయ్ దేవరకొండ అధైర్య పడలేదు. ఈసారి మరో పెద్ద అడుగు వేద్దాం అనుకుని బైలింగ్వువల్ సినిమాలను కాస్త పక్కన పెట్టేసి ఏకంగా సౌతిండియన్ స్టార్‌గా ఎదగడానికి ప్లాన్స్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగా డియర్ కామ్రేడ్ టీజర్‌ను నాలుగు భాషల్లో విడుదల చేస్తామని ప్రకటించాడు. అంటే సినిమాను కూడా నాలుగు భాషల్లో విడుదల చేస్తానని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. అందరూ తేరుకునే లోపు `హీరో` అనే మరో సౌతిండియన్ లాంగ్వేజ్ సినిమాను అనౌన్స్ చేశాడు. ఇది కూడా ముందు తెలుగు, తమిళంలో చేద్దామని అనుకున్నదే.. అయితే విజయ్ దేవరకొండ రిస్క్ తీసుకుని తెలుగు, తమిళంతో పాటు ఈ సినిమాను కన్నడ, మలయాళ భాషల్లో కూడా ప్లాన్ చేసేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమా రూపొందనుంది. ఏప్రిల్ 22 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
previous post
next post
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!