Kushi: “లైగర్” సినిమా పరాజయం తర్వాత విజయ్ దేవరకొండ పూర్తిగా తన ఆశలన్నీ ఖుషి సినిమా పైన పెట్టుకోవడం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 25వ తారీకు “లైగర్” సినిమా విడుదలయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో భారీ అంచనాల మధ్య విడుదలయ్యి… బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. వరుసపరాజయాలు మీద ఉన్న విజయ్ దేవరకొండ కి “లైగర్” కోలుకోలేని దెబ్బ కొట్టింది. బాక్సింగ్ నేపథ్యంలో మాస్ తరహా రీతిలో పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడూ తనకు కలిసి వచ్చే రొమాంటిక్ ప్రేమ కథ నేపథ్యం జోనర్ సినిమా “ఖుషి” చేస్తున్నాడు.
శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ మొదటి తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది. విజయ్ పుట్టినరోజు కానుకగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో విజయ్ మరియు సమంత కెమిస్ట్రీ బాగా కుదిరిందని అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కోసం తాజాగా సమంత మరియు విజయ్ దేవరకొండ టర్కీ వెళ్లారు. అక్కడ అందమైన లోకేషన్ లలో మీ ఇద్దరిపై సాంగ్ షూట్ చేయడం జరిగింది. ఎందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరోవైపు షూటింగ్ విరామంలో అక్కడ రెస్టారెంట్ లో నచ్చిన ఆహారం తింటున్న విజయ్ ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.
ఇదే సమయంలో రిలాక్స్ అవుతున్న ఫోటోలు సమంత తన సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. ఈ రీతిగా టర్కీలో సమంత, విజయ్ దేవరకొండ సందడి చేస్తున్నారు. ఆర్మీ ఆఫీసర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తుండగా కాశ్మీర్ యువతీ పాత్రలో సమంత కనిపిస్తుంది. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తారీకు విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సమంత అనారోగ్యానికి గురికావడంతో షూటింగ్ ఆలస్యం కావడంతో సెప్టెంబర్ మొదటి తారీకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. బ్యాలెన్స్ షూటింగ్ మొత్తం ఇప్పుడు కంప్లీట్ చేసే పనిలో సినిమా యూనిట్ ఉంది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!