సాధారణంగా ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రతి ఒక్కటి వెలుగులోకి వస్తుంది. నిత్యం ఏదో ఒక వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉంటున్నారు ప్రేక్షకులు. ఇదే తరుణంలో సినిమాల పై కూడా చేస్తున్నారు. ఆ సినిమా నుంచి ఏదైనా రిలీజ్ అయితే చాలు దానికి రకరకాలవి యాడ్ చేస్తూ ప్రేక్షకులని నవ్విస్తున్నారు.
ఇక తాజాగా ఇదే విషయం విజయ్ దేవరకొండ.. నంద నందన.. పాట విషయంలో కూడా జరిగింది. విజయ్ దేవరకొండ మనందరికీ సుపరిచితమే. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి ఫేమస్ అయిన విజయ్ ప్రస్తుతం ” ఫ్యామిలీ స్టార్ ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుంది.
ఈ సినిమాపై రౌడీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే సాంగ్ పై ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఈ సాంగ్ లో కొన్ని యాడ్స్ ని ప్రమోట్ చేసినట్లు ఓ వీడియోని క్రియేట్ చేశారు ట్రోలర్స్.
విజయ్ హెడ్ స్టెప్ వేస్తున్నప్పుడు.. క్లీనింగ్ ప్లస్ షాంపూ యాడ్ ఇచ్చినట్లు క్రియేట్ చేసి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నవ్వు తెప్పిస్తున్నారు.
View this post on Instagram
ఇక అనంతరం ఆ సాంగ్ లో విజయ్ బస్ ఎక్కినప్పుడు డాన్స్ చేసే స్టెప్ ని బాటా కంపెనీకి ఎడిట్ చేశారు. ఇలా ఒక్కో స్టెప్ ని ఒక్కో బ్రాండ్ కి అంకితం చేస్తూ వీడియోని వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.