Vishwak Sen: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, దర్శకుడు, రచయిత విశ్వక్ సేస్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. `వెళ్ళిపోమాకే` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన..`ఫలక్‌నుమాదాస్` మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన విశ్వక్.. ఇటీవల `అశోకవనంలో అర్జున కల్యాణం`తో ప్రేక్షకులను పలకరించాడు.
ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో ప్రముఖ టీవీ యాంకర్, విశ్వక్ ల మధ్య చోటుచేసుకున్న వివాదం ఎంత సెన్షేషన్ సృష్టించిందో చెప్పక్కర్లేదు. అయితే ఈ వివాదంతో విశ్వక్ కావాల్సినంత క్రేజ్ సంపాదించుకున్నాడు. పైగా అశోకవనంలో అర్జున కల్యాణంకు మంచి పబ్లిసిటీ ఏర్పడం, సినిమా సూపర్ హిట్ అవ్వడం.. రెండు జరిగాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మొత్తానికి సక్సెస్ జ్యోష్‌లో ఉన్న విశ్వక్ సేస్.. తాజాగా కొత్త కారును కొనుగోలు చేశాడు. గతంలో రేంజ్ రోవర్ కారును కొన్న విశ్వక్ సేన్.. తాజాగా బెంజ్ కారు సొంతం చేసుకున్నాడు. బెంజ్ కారులో టాప్ అండ్ లేటెస్ట్ మోడల్ అయిన మెర్సిడెజ్ బెంజ్ జి వేగన్ 2022ను ఆయన దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని విశ్వక్ స్వయంగా తెలియజేశాడు.
`నా డ్రీం కార్ సొంతం చేసుకున్నాను. ఇదంతా మీ ప్రేమ, అభిమానం వలనే సాధ్యమైంది. అందరికీ కృతజ్ఞతలు` అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చి కొత్త కారుతో దిగిన ఫొటోలను సైతం షేర్ చేశాడు. ఇక కారు ధరెంతో తెలిస్తే మైండ్‌బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే విశ్వక్ సొంతం చేసుకున్న ఆ బెంజ్ కారు ధర రూ. 2. 5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదమైనా ఒక యంగ్ హీరో ఇంత ఖరీదైన కారును కొనుగోలు చేయడం నిజంగా విశేషమనే చెప్పాలి.
https://www.instagram.com/p/Cdr9JzcpHxr/?utm_source=ig_web_copy_link
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!