ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ రిచర్డ్ విలియమ్స్ పాత్రలో నటించబోతున్నాడు. ఇంతకు రిచర్డ్ విలియమ్స్ అంటే మనకు తెలియని ఎవరో వెస్టెండీస్ క్రికెటర్ మాత్రం కాదు. ప్రపంచ టెన్నిస్ చరిత్రలో తమదైన ఆటతో చెరగని ముద్ర వేసిన నల్ల కలువలు వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్‌ల తండ్రి రిచర్డ్ విలియమ్స్. వీనస్, సెరెనాల బయోపిక్స్‌కు స్క్రిప్ట్ సిద్ధమైంది. ఈ సినిమా వీరి తండ్రి రిచర్డ్ విలియమ్స్ కోణంలో సాగుతుంది. కాబట్టి కథకు ఈయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ పాత్రలో నటింప చేయడానికి విల్స్మిత్ను ఎంపిక చేసుకుందట చిత్ర బృందం. అయితే దర్శకుడు ఎవరనేది మాత్రం ఇంకా తెలియపరచలేదు. ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. మరి రిచర్డ్ విలియమ్స్ బయోపిక్ ఎలా మెప్పించనుందో చూడాలి.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!