NewsOrbit
న్యూస్

NIA: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాల కలకలం .. ఆ నేతలే టార్గెట్ గా..

Share

NIA: తెలుగు రాష్ట్రాల్లో మరో సారి ఎన్ఐఏ సోదాల కలకలం రేపుతున్నాయి. దాదాపు 15 ప్రదేశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. పౌర హక్కుల నేతలు, న్యాయవాదుల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తొంది. మవోయిస్టులకు సహకరిస్తున్నారన్న అభియోగాలపై గుంటూరు, తిరుపతి, నెల్లూరు, హైదరాబాద్ లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నేతలే లక్ష్యంగా ఈ సోదాలు జరుపుతోంది.

గుంటూరు జిల్లా పొన్నూరు ప్రజా వైద్యశాలలో ఎన్ఐఏ బృందం తనిఖీలు చేపట్టింది. డాక్టర్ టీ రాజారావు పౌరహక్కుల సంఘం అధ్యక్షుడుగా ఉన్నారు. నెల్లూరులో ఏపీ సీఎల్సీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, అరుణ నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. మరో పక్క తిరుపతిలోని న్యాయవాది క్రాంతి చైతన్య, గుంటూరులో డాక్టర్ రాజారావు నివాసంలో, విజయవాడలో విప్లవ రచయితల సంఘం నాయకుడు అరసవల్లి కృష్ణ నివాసాల్లో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. రాజమండ్రి బొమ్మెరలో పౌర హక్కుల నేత, న్యాయవాది నాజర్, శ్రీకాకుళం కేవి పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మీస్కా కృష్ణ, నెల్లూరు జిల్లాలో ఉస్మాన్ సాహెబ్ పేటలో ఎల్లంకి వెంకటేశ్వర్లు నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఎల్లంకి వెంకటేశ్వర్లు పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా పని చేస్తున్నారు.

కేవిపీఎస్ నేత దుడ్డు వెంకట్రావు, సంతమాగలూరులో శ్రీనివాసరావు, విశాఖ ఎంవీపీ కాలనీలో ఎన్ఆర్ఎస్ ప్రతినిధి, మంగళగిరి మండలం నవులూరులోని మక్కేవారిపేటలో ఎన్ఐఏ బృందాలు తనిఖీలు జరుపుతోంది. హైదరాబాద్ లోనూ ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. విద్యానగర్ లోని పౌర హక్కుల సంఘం నేత సురేష్, బంధుమిత్రుల నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతోంది. అదే విధంగా న్యాయవాది భవాని నివాసంలోనూ తనిఖీలు చేపట్టింది.

Chandrababu Arrest: బాబోరికి బ్యాడ్ టైమ్ నడుస్తుందా..?


Share

Related posts

RRR: నాకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు!స్పీకర్ కు సుప్రీంకోర్టు తీర్పులతో సహా ఆర్ఆర్ఆర్ లేఖ

Yandamuri

మృత్యంజయ హోమం చేయాలని అన్నీ ఆలయాలకు ఆదేశాలు ఇచ్చన ప్రభుత్వం

Siva Prasad

అక్టోబర్ 25 – ఆశ్వీయుజమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma