Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “హరిహర వీరమల్లు”. మొగలుల సామ్రాజ్య కాలం నాటి చారిత్రాత్మకమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ ఒక యోధుడి గా కనిపిస్తున్నారు. సినిమాలో గుర్రపు స్వారీలు మాత్రమే కాక యుద్ధాలు అదేరీతిలో అలనాటి విల్లు విద్యలు ప్రాచీన పోరాటానికి సంబంధించిన యుద్ధాలు సినిమాలో ఉండేలా డైరెక్టర్ క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు.
ఇప్పటికే సినిమాకి సంబంధించి చిన్నపాటి వీడియో అదేరీతిలో టైటిల్ పవన్ కళ్యాణ్ లుక్ వైరల్ గా మారింది. ఖుషి నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న నేపథ్యంలో.. ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. ఇటువంటి తరుణంలో ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో నిధి అగర్వాల్ నటిస్తున్నట్లు లేటెస్ట్గా సినిమా యూనిట్ ఆమె పాత్రకి సంబంధించి పేరు తో కూడిన పోస్టర్ విడుదల చేశారు. ఈరోజు నిధి అగర్వాల్ పుట్టినరోజు కావడంతో.. హరిహర వీరమల్లు సినిమాలో పంచమి పాత్రలో ఆమె నటిస్తున్నట్లు సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.
నాట్యం చేస్తున్న అమ్మాయి గా చాలా వైరల్ లుక్ తో నిధి అగర్వాల్ పోస్టర్ ఫోజ్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం భిమ్లా నాయక్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. చాలా త్వరగా కంప్లీట్ చేసి మిగతా సినిమాలు.. స్టార్ట్ చేసే యోచనలో ఉన్నారు. క్రిష్ సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొద్దిపాటి షూటింగ్ కంప్లీట్ అవ్వడం జరిగింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!