సోషల్ మీడియాలో తరచూ కొన్ని విషయాలు వైరల్ అవుతుంటాయి. ఈ మధ్యకాలంలో ‘ఆప్టికల్ ఇల్యూషన్స్’కు సంబంధించిన చిత్రాలు ట్రెండింగ్‌గా నిలుస్తున్నాయి. మెదడుకు పని చెప్పే పజిల్స్, కళ్లు చెదిరేలా ఫోటో పజిల్స్ లతో చిన్న పిల్లలతో సహా పెద్ద వాళ్లను ఆకర్షిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆప్టికల్ ఇల్యూషన్‌లో దాని ఉన్న వాటిని కనుగొనడం. చూడటానికి సరదాగా అనిపించినా.. ఈ ఆట ఆడాలంటే మెదడుకు బాగా పని పెట్టాల్సి వస్తుంది. కొత్త విషయాన్ని కనుగొన్నామనే సంతృప్తి కలుగుతుంది. ఫోటో పజిల్‌ను గుర్తించిన తర్వాత ఎనలేని సంతోషం వస్తుంది. ప్రపంచాన్నే సాధించామనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.

తాజాగా అలాంటి ఓ ఫోటోనే నెట్టింట షేక్ చేస్తోంది. బ్రైట్ సైట్ అనే యూట్యూబ్ పేజీలో ఆప్టికల్ ఇల్యూషన్‌కు సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేశారు. 9 సెకన్లలో ఈ ఫోటోలో పామును కనుగొనమని సవాల్ కూడా విసిరారు. ఒకవేళ 9 సెకన్లలో పామును గుర్తించినట్లయితే మీకు మేధా శక్తితోపాటు కంటి శక్తి కూడా అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ టాస్క్ మామూలుగా మాత్రం లేదు. పెద్ద చెట్టు.. వేర్లు కూడా భారీగానే వ్యాప్తి చెంది ఉన్నాయి. పామును కనుక్కోవాలంటే.. బ్రైన్‌కు కాస్త పదును పెట్టాల్సి వస్తుంది.

ఈ ఫోటోలో పామును కనుగోనడానికి ప్రయత్నించిన 99 శాతం మంది ఫెయిల్ అయ్యారు. పాము రంగు కూడా చెట్టు వేరుతో కలిసి పోయి ఉండటంతో ఆ పామును ఎవరూ గుర్తించలేకపోయారు. దాంతో ఈ ఫోటో పజిల్ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ఫోటోలో పాము ఎక్కడ ఉందోనని ఆలోచిస్తున్నారా?. అయితే పైన ఉన్న ఫోటోలో రెడ్ మార్క్ చేశాము. అక్కడ పాము దాగి ఉంది.