Raviteja: మాస్ మహారాజతో మరోసారి అదృష్టం పరీక్షించుకోబోతున్న పాయల్ రాజ్‌పుత్..

Share

Raviteja: మాస్ మహారాజ రవితేజ సరసన మరోసారి ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ నటించబోతుందా..ప్రస్తుతం అవుననే వార్తలు సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అవుతున్నాయి. రవితేజ ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకొని సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ సినిమా ఇచ్చిన డబుల్ ఎనర్జీతో రవితేజ వరుసగా సినిమాలను మొదలుపెట్టారు. ఆయన సినిమా లైనప్ చూస్తే దిమ్మతిరిగిపోతుంది. ప్రస్తుతం మాస్ రాజా చేతిలో 5 సినిమాలున్నాయి. వీటిలో త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ‘ధమాకా’ కూడా ఇప్పటికే మొదలైంది.

payal-rajputh-raviteja-pair-repeats-once-again

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్ ఈ సినిమాను మాస్ అండ్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో అనసూయ నటించబోతుందని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాజాగా చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో ఉన్న సాంగ్‌లో అనసూయ కాకుండా ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కనిపించనుందని సమాచారం.

Raviteja: అఫీషియల్ కన్‌ఫర్మేషన్ కూడా త్వరలో రానుందని తెలుస్తోంది.

త్వరలో ఈ సాంగ్‌కు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ కూడా త్వరలో రానుందని తెలుస్తోంది. ఇంతకముందు పాయల్ మాస్ మహారాజాతో డిస్కో రాజా అనే సినిమా చేసింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఆ తర్వాత నుంచి పాయల్ కెరీర్ కూడా చాలా స్లో అయింది. ఇప్పుడు ఆమె యంగ్ హీరో ఆది సాయి కుమార్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి మాస్ మహారాజా సరసన ఐటెం సాంగ్‌లో ఆడిపాడనుందని తెలుస్తోంది. ఈ సారి పాయల్‌కు ఈ ఐటెం సాంగ్ గనక క్రేజ్ తీసుకువస్తే మళ్ళీ పెద్ద హీరోల సరసన సినిమా చేసే అవకాశం అందుకుంటుందేమో చూడాలి.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

30 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

2 గంటలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

4 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

5 గంటలు ago