Prabash: బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంత అనేది మాటల్లో చేప్పడం కష్టమే. ఆయనకు నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మాయిల్లో అతడికి ఉన్న క్రేజ్ మామూలు కాదు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. రాధే శ్యామ్ మూవీ సాంగ్ ఆలస్యం కావడంతో, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయని టైంలో యూవీ క్రియేషన్స్‌ను (UV creations) ఓ రేంజ్లో ట్రోల్ ప్రభాస్ ఫ్యాన్స్.
Radhey Shyam: రాధేశ్యామ్ సినిమాని ఆ ఒక్క భాషలోనే 3,700 థియేటర్లలో రిలీజ్ చేస్తున్న నిర్మాతలు..!
ముచ్చటైన అభిమానం
ఫ్యాన్స్ పై ప్రభాస్ కు సైతం అభిమానం ఉంటుంది. వారి కోసం ఏం చేసినా, ఎంత చేసినా తక్కువే అంటూ పదే పదే ప్రభాస్ అంటుంటాడు. అయితే ఇటీవలే ప్రభాస్ తన వీరాభిమానిని కలిశాడు. ఆ అభిమాని తన తలపై ప్రభాస్ అని కనిపించే విధంగా జుట్టు కట్ చేసుకున్నాడు. దీంతో ప్రభాస్ దానిని చూసి నవ్వకుండా ఉండలేకపోయాడు. అనంతరం ఆయనకు ఓ ఖరీదైన వాచ్‌ను(watc) సైతం గిఫ్ట్‌గా ఇచ్చాడు ప్రభాస్. ఆ అభిమాని ఫొటో, ప్రభాస్ గిఫ్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ మంచి తనాన్ని, గొప్ప తనాన్ని ఆయన ఫ్యాన్స్ (fans) పొగడకుండా ఉండలేకపోతున్నారు.
Radhey Shyam: రాధేశ్యామ్ సినిమాని ఆ ఒక్క భాషలోనే 3,700 థియేటర్లలో రిలీజ్ చేస్తున్న నిర్మాతలు..!
భారీ ప్రాజెక్టులు..
ఇప్పటికే దాదాపు షుటింగ్ పూర్తి చేసుకున్న రాధే శ్యామ్ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టేందుకు మూవీ యునిట్ ఏర్పాట్లు చేస్తున్నది. ఆదిపురుష్ మూవీ షూటింగ్ సైతం పూర్తియినా.. గ్రాఫిక్ వర్క్ కొనసాగుతోంది. ఈ మూవీ 2022 ఆగస్టులో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ప్రకటించిన సలార్ మూవీ కొత్త షెడ్యూల్లో ఈ డార్లింగ్ పాల్గొననున్నాడు. ఇక మరో వైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో భారీ ప్రాజెక్టను ప్లాన్ చేస్తున్నారు. సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిటల్ అనే మూవీని సైతం ప్రకటించిన విషయం తెలిసిందే.