Liger : క్రేజీ కాంబినేషన్ అయిన పూరి జగన్నాథ్ – విజయ్ దేవకొండ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ఉపశీర్షిక. ఇలాంటి టైటిల్, ట్యాగ్ లైన్‌తోనే పూరి ఈ సినిమాలో విజయ్ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. 120 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియన్ సినిమా అంటే అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ షాకవుతున్నారు. ఇంత తక్కువ బడ్జెట్‌తో పూరి లైగర్ సినిమాను పాన్ ఇండియన్ రేంజ్లో ఎలా తీస్తున్నారు అని. కానీ పూరి తలుచుకుంటే పాన్ ఇండియన్ సినిమాను 100 కోట్లలో కూడా తీసి చూపించగలరు.
ఇక ఈ సినిమాను ఆయన సొంత నిర్మాణ సంస్థ అయిన పూరి కనెక్ట్స్ – బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఛార్మి ఇందులో మరో నిర్మాత. బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్యపాండే హీరోయిన్గా నటిస్తోంది. కరోనా అడ్డంకి లేకపోతే ఈ సినిమాను సమ్మర్లోనే రిలీజ్ చేసుండేవారు. కానీ ఇంకా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవకొండ బాక్సర్‌గా కనిపిస్తుండగా తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా రూపొందించనున్నారు. పూరి యాక్షన్ సీన్స్ ఏ రేంజ్లో చూపిస్తారో..సెంటిమెంట్ అండ్ యాక్షన్ సీన్స్‌ని అలాగే చూపిస్తారు.
Liger : పూరి లైగర్ సినిమాను బరిలో దింపేస్తాడు.
కాగా ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న లైగర్ షూటింగ్ క్లైమాక్స్‌కి చేరుకుందట. కేవలం క్లైమాక్స్ ఫైట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కాగా ఈ సినిమాను అధికారకంగా సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ డేట్ కి లైగర్ రిలీజ్ అవుతుందా లేదా అనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ థియేటర్స్ గనక ఆ సమయానికి పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే పూరి లైగర్ సినిమాను బరిలో దింపేస్తాడు. కాస్త పరిస్థితులు అటు ఇటుగా ఉంటే ఓటీటీలో రిలీజ్ చేసిన చేసేస్తాడు. అందులో సందేహం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!