Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ టైటిల్ ఫేవరేట్ గా మొదటి నుండి వార్తల్లో ఉన్న యాంకర్ రవి ఆదివారం ఎపిసోడ్ లో ఇంటి నుండి ఎలిమినేట్ కావడం అందరికీ షాక్ కు గురి చేసింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు కావడంతో మొదటి నుండి యాంకర్ రవి(Ravi) గ్యారెంటీగా టాప్ ఫైవ్ లో ఉంటారని భావించారు. ఎందుకంటే రవి ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ చేసే వ్యక్తి కావడంతో అంతకుముందే పలు షోలలో తనదైన శైలిలో నవ్వులు పూయించడంతో… రవికి తిరుగుండదని భావించారు.
కానీ సరిగ్గా టాప్ పైకి వెళ్లకముందు ఎలిమినేట్ కావడం అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయింది. రవి ఎలిమినేట్ అయినా క్రమంలో ఇంట్లో ఉన్న సభ్యులు అసలు జనాల ఆలోచనలు అంచనా వేయలేని పరిస్థితి లోకి వెళ్ళిపోయారు. ఈ రీతిగా బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో.. క్షణక్షణానికి వాతావరణం మారిపోతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో రవి ఏది విషయం చర్చనీయాంశంగా మారింది. కవి ఎలిమినేట్ అవ్వడానికి గల ప్రధాన కారణలు… హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ ల గురించి ఇతర ఇంటి సభ్యుల దగ్గర మాట్లాడటం.
అదే రీతిలో వేసిన స్ట్రాటజీలు… చాలావరకు వర్కవుట్ అయిన చివరిలో అట్టర్ ఫ్లాప్ కావడం. ముఖ్యంగా హౌస్లో అంచనా వేయడంలో కొద్దిగా విఫలం కావడంతో పాటు స్ట్రాంగ్ ప్లేయర్లను.. రవి(Ravi) టార్గెట్ చేయడం వల్లే బయట అతనికి ఓటింగ్ తగ్గిందని… ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని.. జనాలు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా హౌస్ లో ప్రారంభంలో 19మంది కంటెస్టెంట్ లలో.. బాగా తెలిసిన మొఖం యాంకర్ రవి.. ఇంటి నుండి ఎలిమినేట్ కావడం.. బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు మాత్రమే కాక ఆడియన్స్ కి.. ఊహించని షాక్ ఇచ్చినట్లూ అయింది.