Relationship tips: ప్రతి జంట మంచి లైంగిక జీవితం కావాలనే కోరుకుంటారు.. మంచి లైంగిక జీవితం అంటే రోజులో ఎక్కువ సార్లు శృంగారం లో పాల్గొనడం కాదు, మంచి భావప్రాప్తి ని పొంది గలిగినప్పుడు మాత్రమే, ఆరోగ్యకరమైన శృంగార జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పవచ్చు. శృంగారానికి సంబంధించినరక రకాల అంశాలు మరియు విధానాల గురించి తెలుసుకుందాం.చాలా మంది జంటలు శృంగారం లో భావప్రాప్తి పొందలేకపోతున్నామని ఆవేదన చెందుతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇది చాల మంది జంటల లో సహజం గా నే జరుగుతుంటుంది, కాబట్టి దాని గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన పనిలేదు.
చాలా సార్లు ప్రకటనలు శృంగార పుస్తకాలు, నీలి చిత్రా లలో పురుషుల ప్రైవేట్ భాగం పొడవును పెద్ద సమస్యగా చెప్తూ ఉంటారు. ఇలాంటి యాడ్స్ పురుషులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత వారికీ తెలియకుండానే దానిగురించి రక రకాల ప్రయోగాలు చేస్తుంటారు. కానీ అదంతా వట్టి అపోహ మాత్రమే అని గుర్తు పెట్టుకోండి.. పురుషుల ప్రైవేట్ భాగం చిన్న పరిమాణం లో ఉన్నప్పటికీ, వారు శృంగారం లో భాగస్వామికి మంచి ఉద్వేగాన్ని, తృప్తిని ఇవ్వగలుగుతారని అనేక పరిశోధనలు ఇప్పటికే తేల్చాయి. కాబట్టి దానిగురించి బెంగపెట్టుకోవాలిసిన అవసరమే లేదు. జంటల మధ్య సంవత్సరాలు గడిచే కొద్దీ శృంగార సంబంధం అంతగా ఆసక్తి ఇవ్వదు. అలా ఆసక్తి రావడం లేదని ఆందోళన పడవలసిన అవసరం కూడా లేదు. మీరు ఫోర్ ప్లే వివిధ పద్ధతులలో చేస్తూ ఉన్నట్టయితే మళ్ళి చక్కని ఆనందం పొందుతారు.
సహజంగా స్త్రీలు సంవత్సరాలు తరబడి శృంగారం అనుభవిస్తున్న శృంగారం లో చొరవ చూపడానికి వెనుకాడుతూ ఉంటారు. పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారికీ శృంగార జీవితం మరింత కష్టమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీ ఇద్దరికీ అవకాశం వచ్చినప్పుడు ఏ మాత్రం వదులుకోకుండా, మీ శృంగార జీవితం పైదృష్టి పెట్టండి .. ఎలాంటి పరిస్థితులు ఉన్న మీ కోసం సమయం కుదుర్చుకుని శృంగారం చేయడమే మంచిది .. అది మీ బంధాన్ని, ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలం గా ఉంచుతుంది.